ఈ Xiamoi ఫోన్లు వాడుతున్న వారికి గుడ్ న్యూస్..!!

Updated on 08-Jun-2022
HIGHLIGHTS

నిన్న Xiaomi మరియు Google భాగస్వామ్యాన్ని ప్రకటించాయి

ఈ భాగస్వామ్యంతో Xiamoi ఫోన్ వాడుతున్న వారికి గుడ్ న్యూస్ ప్రకటించింది

YouTube Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అఫర్ చేస్తోంది

నిన్న Xiaomi మరియు Google భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఈ భాగస్వామ్యంతో Xiamoi ఫోన్ వాడుతున్న వారికి గుడ్ న్యూస్ ప్రకటించింది. అదేమిటంటే, షియోమీ మరియు గూగుల్ భాగస్వామ్యం సందర్భంగా లేటెస్ట్ గా షియోమీ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసిన వారికి మూడు నెలల YouTube Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అఫర్ చేస్తోంది. ఈ ఉచిత యూట్యూబ్ ప్రీమియం అఫర్ ఎవరికి వర్తిస్తుందో మరియు ఎలా వర్తిస్తుందో తెలుసుకుందామా.

షియోమీ ప్రకటించిన మూడు నెలల ఉచిత YouTube Premium సబ్ స్క్రిప్షన్ యూజర్లందరికీ వర్తించదు. ఈ ఉచిత యూట్యూబ్ ప్రీమియం ట్రయల్‌కు అర్హత పొందాలంటే, ఫిబ్రవరి 1, 2022 తర్వాత Xiaomi ఫోన్‌లు లేదా టాబ్లెట్‌లను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసిన Xiaomi వినియోగదారులు దీనికి అర్హులు. అంటే, ఫిబ్రవరి 1, 2022 తేదీ తర్వాత కొనుగోలు చేసిన అర్హత ఉన్న ఏదైనా Xiaomi డివైజ్ ఉచిత యూట్యూబ్ ప్రీమియం ట్రయల్‌ పొందేందుకు అర్హత పొందుతుంది.

మరి ఏ షియోమీ స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారు యూట్యూబ్ ప్రీమియం ట్రయల్‌కు అర్హులో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే, క్రింద చూడవచ్చు.

Xiaomi YouTube ప్రీమియం ఆఫర్:

షియోమీ 12 ప్రో, షియోమీ 11i, షియోమీ 11i హైపర్‌ఛార్జ్, షియోమీ 11T ప్రో

ఈ పైన సూచించిన స్మార్ట్ ఫోన్ లు 3 నెలల పొడిగించిన యూట్యూబ్ ప్రీమియం ట్రయల్ అందుకుంటాయి.

రెండు నెలల యూట్యూబ్ ప్రీమియం ట్రయల్ ను అందుకునే డివైజ్ లను క్రింద చూడవచ్చు.

షియోమీ ప్యాడ్ 5, రెడ్ మీ నోట్ 11, రెడ్ మీ నోట్ 11T, రెడ్ మీ నోట్ 11 ప్రో+, రెడ్ మీ నోట్ 11 ప్రో మరియు రెడ్ మీ నోట్ 11S లు ఉన్నాయి.

"అర్హత కలిగిన వినియోగదారులు జూన్ 6, 2022 నుండి అర్హత కలిగిన Xiaomi మరియు Redmi ప్రోడక్ట్స్ పైన ఈ YouTube ప్రీమియం ఆఫర్‌ను రీడీమ్ చేయవచ్చు, ఇది జనవరి 31, 2023 వరకు చెల్లుబాటులో ఉంటుంది." అని Xiaomi తన ప్రకటనలో పేర్కొంది.           

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :