5G Network ఉన్నా చాలా మందికి ఎందుకు ఫుల్ స్పీడ్ రావడం లేదు.. అసలు కారణం ఇదే.!

Updated on 16-Dec-2025
HIGHLIGHTS

చాలా మంది 5జి సర్వీస్ వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు

5G Network ఉన్నా చాలా మందికి ఎందుకు ఫుల్ స్పీడ్ రావడం లేదు

నిజానికి ఇలా జరగడానికి చాలా కారణాలు ఉంటాయి

భారతదేశంలో 5G సర్వీస్ ప్రారంభమై రెండేళ్లు గడుస్తున్నా, చాలా మంది 5జి సర్వీస్ వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేవలం పేరుకు మాత్రమే 5G ఉంది కానీ స్పీడ్ లేదు, అని చాలా మంది 5జి నెట్ వర్క్ ఉపయోగించే యూజర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇది చిన్న పట్టణాల యూజర్లు మొదలుకొని పెద్ద నగరాల్లో సైతం ఉన్నట్లు చెబుతున్నారు. మరి 5G Network ఉన్నా చాలా మందికి ఎందుకు ఫుల్ స్పీడ్ రావడం లేదు, అనేది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే, నిజానికి ఇలా జరగడానికి చాలా కారణాలు ఉంటాయి.

5G Network ఐకాన్ కనిపిస్తే సరిపోదా?

మీ ఫోన్ లో నెట్ వర్క్ పక్కన 5జి ఆ ని ఐకాన్ కనిపిస్తే సరిపోదని మీరు గుర్తించాలి. ఫోన్ లో 5జి ఐకాన్ కనిపిస్తే, ఆ ప్రాంతంలో 5జి నెట్ వర్క్ అందుబాటులో ఉందని అర్థం మాత్రమే వస్తుంది. ఇది మీకు 5జి స్పీడ్ లో అన్ని సర్వీసులు అందిస్తుందని అర్థం కాదు. మీ ఫోన్ లో నిజమైన స్పీడ్ రావాలంటే నెట్‌ వర్క్‌ లో తగినంత స్పెక్ట్రమ్, టవర్స్ మరియు బ్యాక్‌ హాల్ కనెక్టివిటీ ఉండాలి. ఈ మూడు కలిసి పని చేయకపోతే, 5G నెట్ వర్క్ కూడా 4G నెట్ వర్క్ మాదిరిగా ప్రవర్తిస్తుంది.

నెట్ వర్క్ ప్రాధాన్యత

టెలికాం నిపుణుల ప్రకారం, చాలా ప్రాంతాల్లో కూడా Non-Standalone (NSA) 5G నెట్ వర్క్ ఎక్కువగా అమలు చేస్తున్నారు. అంటే, ఇది పూర్తి స్థాయి 5జి నెట్ వర్క్ పై కాకుండా 4G నెట్ వర్క్ పై పూర్తిగా ఆధారపడుతుంది. ఫలితంగా, డేటా స్పీడ్ పెరగవలసిన స్థాయిలో పెరగడం లేదు.

Also Read: అమెజాన్ సేల్ నుంచి బోట్ Dolby Atmos సౌండ్ బార్ ఆల్ టైమ్ చవక ధరలో లభిస్తోంది.!

మీ ఫోన్ కూడా కారణం అని తెలుసుకోండి

పూర్తి స్థాయి 5జి స్పీడ్ అందుకోలేక పోవడానికి మీ స్మార్ట్ ఫోన్ కూడా ఒక కారణం అవుతుంది. ఎందుకంటే, చాలా బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు మరియు కొన్ని మిడ్‌ రేంజ్ ఫోన్లు కూడా అన్ని 5G బ్యాండ్లను సపోర్ట్ చేయవు. ఈ సమస్య కారణంగా నిజమైన 5జి నెట్‌ వర్క్ ఉన్నా కూడా ఫోన్ ఆ నెట్ వర్క్ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోలేకపోతుంది. మొబైల్ ఫోన్ లో పూర్తి స్పీడ్ లేకపోవడానికి లేదా తేడాకు ఇది మరో ప్రధాన కారణం అవుతుంది.

త్వరలో రాబోయే మార్పులు

రాబోయే నెలల్లో Standalone 5G (SA) విస్తరణ, కొత్త స్పెక్ట్రమ్ వేలం మరియు గ్రామీణ ప్రాంతాల్లో 5G టవర్స్ పెంపు వంటి చర్యలు వేగంగా జరుగుతాయని టెలికాం వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఇప్పటికే ఇండియాలో స్టాండ్ అలోన్ (SA) ఆఫర్ చేస్తున్న టెలికాం కంపెనీ గా జియో నిలుస్తుంది. అయితే, ఎయిర్టెల్ కూడా స్టాండ్ అలోన్ (SA) + నాన్ స్టాండ్ అలోన్ (NSA) డ్యూయల్ మోడ్ తో 13 సర్కిల్స్ లో వేగవంతమైన సర్వీస్ ఆఫర్ చేస్తోంది.

ప్రస్తుతం వేగవంతమైన 5జి కొసకి మన చేయాల్సిన పని ఏమిటి?

5G స్పీడ్‌ పై అసంతృప్తిగా ఉన్న యూజర్లు ముందుగా తమ ఫోన్ బ్యాండ్, నెట్‌ వర్క్ సెట్టింగ్స్ మరియు ప్రాంతీయ కవరేజ్ ను పరిశీలించాలి. ముఖ్యంగా, “5G” అనే పదం కన్నా నిజమైన స్పీడ్ పై దృష్టి పెట్టాల్సిన సమయం ఇది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :