కొత్త 3D కూల్ టెక్నాలజీతో 60 శాతం వేగంగా చల్లబరిచే AC లను లాంచ్ చేసిన Whirlpool

Updated on 22-Mar-2022
HIGHLIGHTS

ఇందులో డస్ట్ మరియు ఎలర్జీ ఫిల్టర్లతో గదిలోని క్రిములను కూడా తొలగించే విధంగా ఉంటుంది.

హోమ్ అప్లయన్సెస్ కి మంచి పేరుగాంచిన Whirlpool సంస్థ, ఈరోజు ఇండియాలో సరికొత్త ఇన్వర్టర్ AC లను విడుదల చేసింది.  ఈ ఇన్వర్టర్ AC లను ఒక 3D కూలింగ్ టెక్నాలజీతో తీసుకొచ్చినట్లు ప్రకటించింది. ఈ 3D కూల్ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్లు, వినియోగదారుల దైనందిన జీవితములో చక్కగా ఉపయోగపడేలా డిజైన్ చేసినట్లు కూడా తెలిపింది. అంతేకాదు, ఈ AC లను ప్రస్తుతం Whirlpool.com ద్వారా సేల్ చేస్తున్నట్లు మరియు ఇవి అందుబాటులో ఉన్నట్లు వివరించింది.

3D కూల్ టెక్నలాజి AC : ప్రత్యేకతలు

ఈ 3D కూల్ టెక్నలాజి AC ఇందులో అందించిన ఈ కొత్త టెక్నాలజీ వలన 60% వేగంగా మీ గదిని చల్లభరుస్తుందని సంస్థ తెలిపింది. అంతేకాదు, ఇలా త్వరగా చల్ల బరచడానికి గల కారణాన్ని కూడా వివరించింది. సాధారణ AC లు, మన గదిలో వుండే వేడి గాలిని ఒక AC కి వుండే ఒక మార్గం (Vent) ద్వారా పీల్చుకొని దాన్ని చల్లబరుస్తుంది. అయితే, ఈ 3D కూల్ టెక్నలాజి AC మాత్రం మూడు మార్గాల (Vent) ద్వారా గడిల్ని వేడి గాలిని పీల్చుకొని చాలా త్వరగా గదిలోని వాతావరణాన్ని చల్లబరుస్తుందని చెబుతోంది.

ఈ AC ల యొక్క అదనపు ఫీచర్ల విషయానికి వస్తే, ఇది వాయిస్ – ఎనేబుల్ తో పాటుగా wi fi- ఎనేబుల్ తో పాటుగా వస్తుంది. కాబట్టి, మీ స్మార్ట్  ఫోన్ లేదా గూగుల్ హోమ్ వంటి వాటితో నేరుగా ఆపరేట్ చేయవచ్చు. అలాగే, ఇందులో ఇన్వర్టర్ టెక్నాలజీని కూడా ఇచ్చారు కాబట్టి ఇది మీకు ఎక్కువ ఎనర్జి సేవింగ్స్ కూడా చేస్తుంది. ఇది 50 డిగ్రీల వేడి వున్నా సమయాల్లో కూడా ఎటువంటి ఆటంకము లేకుండా చక్కగా పనిచేస్తుందని మరియు ఇందులో డస్ట్ మరియు ఎలర్జీ ఫిల్టర్లతో గదిలోని క్రిములను కూడా తొలగించే విధంగా ఉంటుంది.                                        

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :