వాట్సాప్ అప్ కమింగ్ ఫీచర్లు: హెవీ ఫైల్స్ షేరింగ్ ..హెవీ గ్రూప్ క్రియేట్ .. ఏంటా కొత్త ఫీచర్లు..!!

Updated on 29-Dec-2022
HIGHLIGHTS

వాట్సాప్ మరికొన్ని కొత్త మరియు ఉపయోగకరమైన ఫీచర్లను పరిచయం చెయ్యబోతోంది

Meta రెండు కొత్త ఫీచర్లను వాట్సాప్ లో అందించడానికి చూస్తోంది

ఈ కొత్త ఫీచర్ల ద్వారా Whatsapp మరింత సౌకర్యంవంతంగా మారుతుంది

వాట్సాప్ మరికొన్ని కొత్త మరియు ఉపయోగకరమైన ఫీచర్లను పరిచయం చెయ్యబోతోంది. Meta రెండు కొత్త ఫీచర్లను వాట్సాప్ లో అందించడానికి చూస్తోంది. వీటి ద్వారా విఇనియోగదారులు హెవీ ఫైల్స్ షేరింగ్ తో పాటుగా ఎక్కువ మందిని యాడ్ చేయగలిగే హెవీ గ్రూప్ క్రియేట్ లను కూడా పొందుతారు. ఇప్పటికే, ఫీచర్ రెడీ మరియు ఫీచర్ రిజ్ యాప్ గా పేరుపొందిన వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ల ద్వారా మరింత సౌకర్యంవంతంగా మారుతుంది. మరి ఆ కొత్త ఫీచర్లు మరియు వాటి విశేషాలు ఏమిటో చూద్దామా.

2GB పరిమాణంలో ఉన్న సింగిల్ ఫైల్ ను షేర్ చేయగలిగే మరియు 512 మంది సభ్యులతో కూడిన పెద్ద గ్రూప్ వంటి కొత్త ఫీచర్‌లను WhatsApp పరిచయం చేస్తోంది. అంతేకాదు, వీటితో పాటుగా థంబ్స్ అప్, స్మైల్, హార్ట్, ఏడుపు, షాక్ కు గురైన ముఖం మరియు ఫోల్డెడ్ హ్యాండ్స్ వంటి 6 రియాక్షన్ లను కూడా జత చేయనున్నది. అంటే, గ్రూప్‌ లలో ఎక్కువ మంది సభ్యులు, పెద్ద ఫైల్ షేరింగ్ మరియు ఎమోజీలతో మెసేజ్ పట్ల మీ భావోద్వేగాలను తెలియజేయడం వంటి కొత్త ఫీచర్లతో WhatsApp మరింత ఫీచర్-రిచ్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌గా మారుతోంది.

వాస్తవానికి, ఇప్పటి వరకు 100MB ఫైల్ షేరింగ్ మాత్రమే ఉండగా దీని పరిమితిని ఏకంగా 2GB వరకూ పెంచడం మంచి విషయంగా పరిణమిస్తుంది. పెద్ద ఫీల్ షేరింగ్ కోసం ఇతర మార్గాల కోసం చూడకుండా వాట్సాప్ ద్వారా నే పంపించవచ్చు. అలాగే, ఈ షేర్ చేసేది ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా భద్రపరచబడుతుంది. చిన్న వ్యాపారాలు మరియు స్కూల్ గ్రూప్స్ మధ్య సహకారానికి ఈ బిగ్ గ్రూప్ దోహదపడుతుందని WhatsApp భావిస్తోంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :