ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగించే చాటింగ్ ఆప్ Wahtsapp రేపటి నుండి ఈ Android మరియు iPhone లలో Whatsapp పనిచెయ్యదు. ఒకవేళ మీరు కనుక అయి లిస్టులో అందించిన స్మార్ట్ ఫోన్లను వాడుతున్నట్లయితే, రేపటి నుండి మీ వాట్స్ ఆప్ అకౌంట్ ను మరేదైనా స్మార్ట్ ఫోనులో ఉపయోగించాల్సి వుంటుంది. ఎందుకంటే, 2021 నుండి ఈ లిస్టులో ప్రకటించిన Android మరియు iPhone లలో Whatsapp పనిచేయడానికి కావాల్సిన సపోర్ట్ ను నిలిపివేస్తుంది. కాబట్టి, దీనికి సంబంధించిన అన్ని విషయాలను ఇక్కడ తెలుసుకోండి.
ఫేస్ బుక్ యాజమాన్యంలోని ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ Whatsapp, పాత OS ల పైన చేసే స్మార్ట్ ఫోన్లకు సపోర్ట్ ని నిలిపివేయనుంది. కాబట్టి, ఈ పాత OS ల పైన ఆధారపడి పనిచేసే ఆండ్రాయిడ్ మరియు iOS స్మార్ట్ ఫోన్లలో ఇక వాట్స్ అప్ యాప్ పనిచెయ్యదు.
ఇక ఎటువంటి ఆండ్రాయిడ్ మరియు iOS స్మార్ట్ ఫోన్ల పైన ఈ ప్రభావం ఉంటుందనే విషయానికి వస్తే, iOS 9 మరియు ఆండ్రాయిడ్ 4.0.3 కంటే తక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ (OS) పైన చేసే ఆండ్రాయిడ్ మరియు iOS స్మార్ట్ ఫోన్లలో Whatsapp పనిచెయ్యడం ఆపేస్తుంది. వాట్స్ అప్ చెబుతుందంటే, తమ పూర్తి సర్వీసులను అందించాలనంటే వారి ఆపరేటింగ్ సిస్టం యొక్క లేటెస్ట్ వర్షన్ కి అప్డేట్ అవ్వాలని సూచిస్తోంది.
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్ల విషయానికి వస్తే, చాలా తక్కువ మంది మాత్రమే 4.0.3 కంటే తక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ (OS) పైన చేసే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లను కలిగి వున్నారు. iOS పరంగా ఐఫోన్ 4 యూజర్లు తమ వాట్సాప్ ఫీచర్స్ ను కోల్పోతారు. ఇంకా మరికొన్ని iOS ఫోన్లు iOS 9 కు అప్డేట్ అవ్వాల్సివుంటుంది.