అతిత్వరలోనే Whatsapp యూజర్లు సరికొత్త ఫీచర్ అందుకోనున్నారు. సంస్థ మల్టీ-డివైస్ సపోర్ట్ పనిచేస్తుందని తెలియచేస్తోంది. వాస్తవానికి, కంపెనీ ఈ ఫీచర్ పై చాలా కాలంగా పనిచేస్తోంది. ఈ ఫీచర్ సహాయంతో అంటే వాట్సాప్ మల్టీ-డివైస్ ఫీచర్ తో, యూజర్లు తమ Whatsapp అకౌంట్ ను ఒకే సమయంలో పలు వేర్వేరు పరికరాల్లో(Devices) లో రన్ చేయవచ్చు. ఇందులో, Whatsapp Web పాత్ర కూడా ఉంటుంది కానీ ఇది అద్ధంలో ప్రతిభింభముగా చూడవచ్చు. ఇది మీ ప్రొఫైల్‌ను డెస్క్‌టాప్‌లో Mirrior గా చూపించబోతోంది.
మనం WABetainfro యొక్క నివేదికను పరిశీలిస్తే, ఈ ఫీచర్ యొక్క అంతర్గత పరీక్ష అంటే, WhatsApp మల్టి డివైజ్ ఫీచర్ యొక్క ఇంటర్నల్ టెస్టింగ్ కూడా WhatsApp ప్రారంభించింది. అయితే, ఈ ఫీచర్ను వాస్తవానికి ఎప్పటివరకూ ప్రారంభించవచ్చనేది ఇంకా పూర్తిగా వెల్లడించలేదు.
గత వారం ఒక ట్వీట్‌లో, WABetainfro, "ఇది ఇంకా అందుబాటులో లేదు, ఇంకా విడుదల తేదీ గురించి ఎటువంటి సమాచారం లేదు: అయితే ఇది రాబోయే రెండు నెలల్లో మాత్రం ప్రారంభమయ్యే అవకాశం ఉండవచ్చు లేదా బహుశా, దీనికి 4 నెలలు పట్టవచ్చు, అది కాకపోతే 6 నెలలు పట్టవచ్చు … అయితే, మంచి విషయం ఏమిటంటే, వాట్సాప్ నుండి ఈ ఫీచర్ యొక్క టెస్టింగ్ ప్రారంభమైంది."
From now on WhatsApp is internally starting some important tests for the multi device feature.
It's not available yet and there isn't a release date: it could be next two months, four months, six months