వాట్సాప్ లో మెసేజ్ టైప్ చేయకుండానే మెసేజిలను పంపవచ్చు

Updated on 01-Feb-2022
HIGHLIGHTS

వాట్సాప్ కొత్త ట్రిక్

మెసేజ్ టైప్ చేయకుండానే పంపించవచ్చు

మీ ఫోన్ లో కూడా సెట్ చేసుకోవాలా

వాట్సాప్ లో మెసేజ్ టైప్ చేయకుండానే మెసేజిలను పంపవచ్చని మీకు తెలుసా?. ఇంకా మీరు వాట్సాప్ లో చాటింగ్ చెయ్యాలంటే టైపింగ్ చేస్తున్నట్లయితే  ఈ విషయం తెలుసుకోండి. ఎందుకంటే, మీ వాట్సాప్ నుండి టైప్ చెయ్యకుండానే మీరు మీకు కావలసిన సందేశాన్ని పంపించవచ్చు.  దీనికోసం మీరు మీ ఫోన్ లో ఉండే అసిస్టెంట్ ఫీచర్ ను ఉపయోగించుకోవచ్చు. 

ఇప్పటికే మీరు మీ వాట్సాప్ ల ఈ  ఫీచర్ ను ఉపయోగిస్తుంటే చాలా మంచిది. ఒకవేళ మీకు కనుక ఈ ఫీచర్ ను మీ ఫోన్ లో మీ వాట్సాప్ తో ఎలా  ఉపయోగించాలో తెలియక పొతే, ఇక్కడ నుండి ఈజీగా తెలుసుకోవచ్చు మరియు మీరు కూడా మీ వాట్సాప్ మెసేజిలను టైప్ చెయ్యకుండానే పంపించవచ్చు.

ముందుగా, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో గూగుల్ అసిస్టెంట్ మరియు iOS ఫోన్లలో సిరి సహాయంతో మెసెసింగ్ యాప్ ఒపెన్ చెయ్యకుండానే మెసేజిలను పంపించవచ్చు. అలాగే, మెసేజింగ్ యాప్ తెరవకుండానే మెసేజిలను చదివే అవకాశం వుంది. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి ఫీచర్ ను వాట్సాప్ కూడా తీసుకొచ్చింది.

మీ వాట్సాప్ లో ఈ ఫీచర్ ను యాక్టివేట్ చెయ్యాలనుకుంటే గూగుల్ యస్ మరియు వాట్సాప్ నోటిఫికేషన్ యాలకు యాక్సెస్ ఇవ్వాల్సివుంటుంది. ఒకవేళ మీకు ఈ ఫీచర్ అవసరం లేదనుకుంటే సెట్టింగ్ లోకి వెళ్లి ఎప్పుడైనా యాక్సెస్ ను నిలిపి వేయవచ్చు. మీ ఫోన్లో ఈ ఫీచర్ ను యాక్టివేట్ చెయ్యాలనుకుంటే ఈ క్రింద విధంగా చేయండి.

వాట్సాప్ లో  ఈ ఫీచర్ కోసం ఇలా చేయండి

ముందుగా మీ ఫోన్లో గూగుల్ అసిస్టెంట్ ను యాక్టివేట్ చేయాలి. గూగుల్ అసిస్టెంట్ యాక్టివేట్ అయిన తరువాత మీరు మీ కాంటాక్ట్స్ లో ఎవరికి వాట్సాప్ మెసేజ్ పంపించాలనుకుంటున్నారో సూచించండి. తరువాత, గూగుల్ అసిస్టెంట్ మీరు ఏ సందేశం పంపాలనుకుంటున్నారో, లేదా మీరు ఏమి రాయాలనుకుంటున్నారో అడుగుతుంది. తరువాత, వర్చువల్ అసిస్టెంట్ మీరు చెప్పిన టైప్ చేసి చూపుతుంది. ఈ మెసేజ్ ను Send చెయ్యమని చెప్పిన వెంటనే మెసేజ్ సెండ్ చేయబడుతుంది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :