Whatsapp: ప్రభుత్వ కొత్త డిజిటల్ రూల్స్ పైన వాట్సాప్ దావా

Updated on 26-May-2021
HIGHLIGHTS

Whatsapp: కొత్త డిజిటల్ రూల్స్ పైన వాట్సాప్ దావా వేసింది

కొత్త నిభంధనలను సవాలు చేస్తూ, న్యూ ఢిల్లీ హైకోర్టులో ఈరోజు వాట్సాప్ కేస్ ఫైల్ చేసింది

కొత్త నిబంధనలు పాటిస్తే ప్రైవసీ కి భంగం వాటిల్లే ప్రమాధం

Whatsapp: కొత్త డిజిటల్ రూల్స్ పైన వాట్సాప్ దావా వేసింది. వాట్సాప్ లో మెసేజెస్ ద్వారా తప్పు చేసినట్లుగా ఆరోపణలను ఎదుర్కొనే వారి పంపిన మూలాల్ని కనిపెట్టడానికి కొత్త ఇంటర్నెట్ రూల్స్ ని తీసుకొచ్చే విధంగా తీసుకున్న కొత్త నిభంధనలను సవాలు చేస్తూ, న్యూ ఢిల్లీ హైకోర్టులో ఈరోజు వాట్సాప్ కేస్ ఫైల్ చేసింది. కొత్త నిబంధనలు పాటిస్తే దేశంలోని యూజర్ల అందరి ప్రైవసీ కి భంగం వాటిల్లే ప్రమాధం వుందని ఫేస్ బుక్ యాజమాన్యంలోని ఈ ప్రముఖ మెసేజింగ్ యాప్ పేర్కొంది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నియమాలు, 2021 డిజిటల్ మీడియా, OTT ప్లేయర్స్ మరియు సోషల్ మీడియా యాప్స్ పైన నిబంధనలను కఠినతరం చేస్తాయి. 5 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్ల నుండి ఇతరులకు చేరిన సమస్యాత్మక కంటెంట్ ను పంపిన మొదటి వ్యక్తిని గుర్తించడానికి మార్గాలను ప్రారంభించాల్సి ఉంటుంది. IT  చట్టంలోని సెక్షన్ 69 కింద న్యాయ ఉత్తర్వులకు ఇది ప్రతిస్పందనగా ఉంటుంది.

వాస్తవానికి, నిబంధనల ప్రకారం మొదటిగా పంపిన వ్యక్తి భారత దేశానికి వెలుపల ఉన్నట్లయితే, భారతదేశంలో అందుకున్న వ్యక్తి మొదటి ఆరిజనేటర్స్ గా పరిగణింపబడతాడు. ఇక్కడ వాట్సాప్, ఈ నిందితులను గుర్తించడానికి అటువంటి సందేశాల రిసీవర్లు మరియు ఆరిజనేటర్స్ రెండింటి యొక్క ఎన్క్రిప్షన్ (గుప్తీకరణను) విచ్ఛిన్నం చేయాల్సి వస్తుంది.

అంతేకాదు, దీని కోసం ఇది యూజర్ మెసేజ్ డేటాబేస్ ని కూడా నిర్వహించాలి. ఈ క్రొత్త నియమాలు వినియోగదారు ప్రైవసీకి  హానికరమని మరియు భారతదేశంలోని వినియోగదారుల కోసం ఎండ్-టు-ఎండ్ మెసేజ్ ఎన్క్రిప్షన్ ను నాశనం చేస్తాయని చాలా కూడా చాలా కమ్యూనిటీ గ్రూప్స్ అంగీకరిస్తున్నాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :