Whatsapp లో ఉపయోగకరమైన కొత్త ఫీచర్ వస్తోంది..!!

Updated on 03-Jul-2022
HIGHLIGHTS

Whatsapp లో ఉపయోగకరమైన కొత్త ఫీచర్ వస్తోంది

ఈ కొత్త ఫీచర్ ను కొత్త అప్ డేట్ ద్వారా అందిస్తుంది

కొత్త ఫీచర్ వాట్సాప్ గ్రూప్స్ కోసం ఉపయోగకరం

Whatsapp లో ఉపయోగకరమైన కొత్త ఫీచర్ వస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ మరియు ఉపయోగకరమైన ఫీచర్లను వినియోగదారులకు అందించడంలో ముందుండే వాట్సాప్, ఇప్పుడు మరొక కొత్త ఉపయోగకరమైన ఫీచర్ ను కూడా తీసుకు వస్తోంది. అయితే, వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ ను కొత్త అప్ డేట్ ద్వారా అందిస్తుంది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ కొత్త ఫీచర్ ను వాట్సాప్ గ్రూప్స్ కోసం ఉపయోగకరంగా ఉండేలా తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.

మీరు ఏదైనా వాట్సాప్ గ్రూప్ నుండి ఎగ్జిట్ అయ్యారనుకోండి, ఆ విషయం ఆ గ్రూప్ లో వున్నా ప్రతిక్కరికీ తెలిసిపోతుంది. అయితే, కొత్త అప్డేట్ తరువాత అలా జరగదు, వాట్సాప్ ఈ ట్రెండ్ ని మారుస్తోంది. ఇప్పుడు వస్తున్న కొత్త అప్డేట్ తో మీరు ఏదైనా గ్రూప్ నుండి ఎగ్జిట్ అయితే, ఆ విషయం ఆ గ్రూప్ లోని ఇతరులకు తెలియదు. అంటే, మీరు ఎవరికీ తెలియకుండా ఏ గ్రూప్ నుండైనా ఎగ్జిట్ కావచ్చు. మీరు ఎగ్జిట్ అయిన విషయం కేవలం గ్రూప్ అడ్మిన్ కు మాత్రమే తెలుస్తుంది. మీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఇప్పుడు ఎవరికీ వెళ్లదు, ఇది ఈ కొత్త అప్‌డేట్ యొక్క అతిపెద్ద ప్రయోజనం.

ఈ కొత్త ఫీచర్ మరియు అప్డేట్ గురించి WABetainfo సమాచారం అందించింది. WABetainfo ఈ విషయాన్ని బ్లాక్ ద్వారా పోస్ట్ చేసింది. అంతేకాదు, వాట్సాప్‌ లో ఈ ఫీచర్‌ను త్వరలో వినియోగదారులకు తీసుకురాబోతున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఇప్పటికే వాట్సాప్ బీటా వెర్షన్ వాడుతున్న వారికీ ఈ ఫీచర్ గురించి తెలిసే ఉంటుంది. ఈ ఫీచర్ ఇటీవలే బీట్ వెర్షన్ లో అంధుబాటులోకి వచ్చింది. వాట్సాప్ లేటెస్ట్ అప్‌డేట్ వచ్చినప్పుడు మాత్రమే ఈ ఫీచర్‌ ఉపయోగంలోకి వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :