వాట్సాప్ లో కొత్త ఫీచర్లు, కొత్త అప్ డేట్స్ వస్తున్నాయి. ఈ కొత్త ఫీచర్ లలో ఒకటి వాట్సాప్ గ్రూప్స్ కోసం అప్డేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, మరొకటి యూజర్ ప్రైవసీ మరింత పటిష్టం చేయడం కోసం తీసుకువస్తోంది. ఈ కొత్త ఫీచర్లతో వాట్సాప్ మరింత సౌకర్యవంతంగా మారనునట్లు కూడా తెలుస్తోంది. మరి వాట్సాప్ తీసుకువస్తున్న ఆ మూడు కొత్త ఫీచర్లు మరియు వాటి విశేషాలు ఏమిటో చూద్దామా.
మొదటి ఫీచర్: మీరు ఏదైనా వాట్సాప్ గ్రూప్ నుండి ఎగ్జిట్ అయ్యారనుకోండి, ఆ విషయం ఆ గ్రూప్ లో వున్నా ప్రతిక్కరికీ తెలిసిపోతుంది. అయితే, కొత్త అప్డేట్ తరువాత అలా జరగదు, వాట్సాప్ ఈ ట్రెండ్ ని మారుస్తోంది. ఇప్పుడు వస్తున్న కొత్త అప్డేట్ తో మీరు ఏదైనా గ్రూప్ నుండి ఎగ్జిట్ అయితే, ఆ విషయం ఆ గ్రూప్ లోని ఇతరులకు తెలియదు. అంటే, మీరు ఎవరికీ తెలియకుండా ఏ గ్రూప్ నుండైనా ఎగ్జిట్ కావచ్చు. మీరు ఎగ్జిట్ అయిన విషయం కేవలం గ్రూప్ అడ్మిన్ కు మాత్రమే తెలుస్తుంది. మీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఇప్పుడు ఎవరికీ వెళ్లదు, ఇది ఈ కొత్త అప్‌డేట్ యొక్క అతిపెద్ద ప్రయోజనం.
రెండవ ఫీచర్: వాట్సాప్ వినియోగదారుల ప్రైవసీ కాపాడేందుకు వీలుగా కొత్త ఫీచర్ ను తీసుకురానుంది. ఇప్పుడు తీసుకురానున్న కొత్త ఫీచర్ ద్వారా మీరు వాట్సాప్ లో ఆన్లైన్ వున్నా కూడా మీరు ఆన్లైన్లో ఉన్నట్లు ఎవరికి తెలియదు. సింపుల్ గా చెప్పాలంటే, మీరు వాట్సాప్ ఆన్లైన్ లో ఉన్నా కూడా ఎవరికీ తెలియకుండా దాచిపెట్టేలా ఒక కొత్త ఫీచర్ ను తీసుకువస్తోంది. అదే, హైడ్ ఆన్లైన్ స్టేటస్ మరియు ఇది చాలా మంది ప్రైవసీని పెంచడంలో తోడ్పడుతుందని భావిస్తున్నారు. జనరల్ గా మనం వాట్సాప్ ఓపెన్ చేసిన వెంటనే మనం ఆన్లైన్ లో ఉన్న స్టేటస్ ను చూపిస్తుంది. కానీ, వాట్సాప్ తీసుకువస్తున్న కొత్త ఫీచరతో ఇక ఆన్లైన్ స్టేటస్ కనిపించదు.
మూడవ ఫీచర్: వాట్సాప్ ఉపయోగించే ప్రతిఒక్కరికీ కూడా 'Delete For Every one' గురించి పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు. వాట్సాప్ లో అనుకోకుండా లేదా యాక్సిడెంటల్ గా ఏదైనా మెసేజ్ చేస్తే దాన్ని ఎవరూ చూడకుండా డిలీట్ చేసేందుకు ఈ అప్షన్ ఉపయోగిస్తాము. ప్రస్తుతం చాలా లిమిటెడ్ టైం వరకూ మాత్రమే ఈ డిలీట్ అప్షన్ అందుబాటులో ఉండగా, వాట్సాప్ ఇప్పుడు దీన్ని 2 రోజుల 12 గంటల వరకూ పెంచడానికి చూస్తోంది.
వాస్తవానికి, ఇప్పటి వరకూ 1 గంట, 8 నిమిషాలు మరియు 16 సెకన్ల లోపలే ఏదైనా మెసేజ్ ను 'Delete For Every One' అప్షన్ తో తొలగించడానికి వీలుంది. అయితే, వాటప్ ఇప్పుడు ఈ సమయాన్ని 2 రోజుల 12 గంటల వరకూ పెంచునట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంత మంది బీటా యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది మరియు రానున్న రోజుల్లో మరింత మందికి అంధిస్తుంది.
ఈ ప్రముఖ మెసేజింగ్ యాప్, ముఖ్యంగా గ్రూప్ లలోని ఏదైనా మెసేజ్‌ని డిలీట్ చేయడానికి గ్రూప్ అడ్మిన్ లను అనుమతించే సామర్థ్యంపై పని చేస్తోంది. అంటే, గ్రూప్ లలో ఏదైనా మెసేజ్ తప్పుగా అనిపించినట్లయితే ఈ ఫీచర్ ద్వారా ఆ గ్రూప్ అడ్మిన్ ఆ మెసేజ్ ను తొలగించ వచ్చన్న మాట.