Whatsapp గుడ్ న్యూస్: అదిరే కొత్త ఫీచర్ తీసుకువస్తోంది..!

Updated on 24-Sep-2021
HIGHLIGHTS

Whatsapp కస్టమర్ల కోసం అదిరే కొత్త ఫీచర్

మరొక కొత్త ఫీచర్ ను త్వరలో జతచేయనుంది

కొత్త వాట్సాప్ ఇమేజ్ ఫీచర్

ఫేస్ బుక్ సారధ్యంలోని ప్రముఖ చాటింగ్ యాప్ Whatsapp తన కస్టమర్ల కోసం అదిరే కొత్త ఫీచర్ తీసుకువస్తోంది. వాట్సాప్ తన యూజర్ అనుభవాన్ని మరింత అధునాతనంగా మార్చడానికి ఈ కొత్త ఫీచర్ ను తీసుకువచ్చే పనిలో ఉంది. ఇప్పటికే చాలా ఆధునిక ఫీచర్లను కలివున్న వాట్సాప్, ఇప్పుడు ఫ్యూచర్ అప్‌డేట్‌లతో మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచిస్తోంది. దీనికి అనుగుణంగానే ఇప్పటి వరకూ ఉన్న ఫీచర్లతో పాటుగా మరొక కొత్త ఫీచర్ ను త్వరలో జతచేయనుంది.

వాట్సాప్ ఇప్పుడు కొత్తగా ప్రస్తుతం వున్న స్టికర్ ఫీచర్ కి కొత్త వాట్సాప్ ఇమేజ్ ఫీచర్ ను జత చేయనుంది. అంటే, ఇప్పటి వరకు మరిన్ని వాట్సాప్ స్టిక్కర్స్ లేదా ఇమేజ్ లను స్టిక్కర్స్ గా మార్చడానికి తర్డ్ పార్టీ యాప్స్ ను ఆశ్రయించాల్సి ఉండగా, వాట్సాప్ అందించే కొత్త ఫీచర్  తో ఫోటోగ్రాఫ్‌లను నేరుగా యాప్‌లోనే WhatsApp స్టిక్కర్‌లుగా మార్చవచ్చు.

దీని అధికారిక బ్లాగ్ సైట్ ప్రకారం, వాట్సాప్ ఈ ఫీచర్ ను Android మరియు iOS రెండింటికి అందిస్తుంది మరియు ఈ కొత్త కొత్త ఫీకేహార్ ను జతచేసిన వెంటనే క్యాప్షన్ బార్ లో ఉన్న View Once Option కుడివైపున ఒక కొత్త స్టిక్కర్ గుర్తుతో కనిపిస్తుంది. వాట్సాప్ యూజర్లు క్యాప్షన్ బటన్ ఎంచుకోగానే కావాల్సిన ఇమేజ్ స్టిక్కర్ గా షేర్ అవుతుంది.

వాట్సాప్ కొత్త ఫీచర్ ద్వారా అందించబడే ఈ స్టిక్కర్ ఇతర థర్డ్ పార్టీ స్టిక్కర్ ప్యాక్‌ల మాదిరిగానే స్క్వేర్ బాక్స్ కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. అంతేకాదు, షేర్ చేయడానికి ముందు స్టిక్కర్‌ని మార్చాడనికి ఎటువంటి అవకాశాలు ఉండవు. అలాగే, మూవ్ మెంట్స్ జతచేసి దాన్ని యానిమేటెడ్ స్టిక్కర్ గా మార్చే అవకాశం కూడా ఇందులో ఉండదు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :