SMS Spoofing: ఒక్క మెసేజ్ తో డబ్బు కొట్టేస్తారు …ఎలాగంటే..!

Updated on 18-Feb-2022
HIGHLIGHTS

మోసగాళ్లు ఎదుటివారిని మోసం చేయడానికి కొత్త టెక్నాలజీ కనిపెడుతున్నారు

'SMS Spoofing' అనే కొత్త సాధనాన్ని ఈ జాబితాకు జోడించారు

అకౌంట్ లో ఉన్న డబ్బంతా ఒక్క మెసేజ్ తో ఊడిచేస్తారు

మారుతున్న కాలం మరియు టెక్నాలజీతో పాటుగా మోసగాళ్లు కూడా ఎదుటివారిని మోసం చేయడానికి కొత్త టెక్నాలజీ కనిపెడుతున్నారు. అంతేకాదు, పెరుగుతున్న టెక్నాలజీ కూడా వారికీ ఒకవిధంగా సహాయపడుతోంది. ప్రస్తుతం ఆన్లైన్ మోసగాళ్లు కొత్తగా తమ మోసాలకు 'SMS Spoofing' అనే కొత్త సాధనాన్ని ఈ జాబితాకు జోడించారు. SMS Spoofing అనేది సెండర్స్ మెసేజీని టెక్స్ట్ గా మార్చే టెక్నీక్ ఇది. ఇది ఒకరి మెసేజీని మరొకరిదిగా మార్చి చూపించడానికి కూడా ఉపయోగపడుతుంది.

అంటే, ఈ SMS బ్యాంక్ నుండి వచ్చిన ఒరిజినల్ మెసేజ్ మాదిరిగా చెల్లుబాటు అయ్యేలా కనిస్తుంది మరియు పంపిన వారి సాధారణంగా కనిపించేలా చేస్తుంది.

SMS Spoofing చీటింగ్ ఎలా చేస్తారు?

ఫ్రాడ్ స్టర్స్ మీకు ఒక SMS పంపించి ఆ SMS ను మరొక నంబర్ కు పంపించమని అడుగుతారు. మీరు SMS ను ఫార్వార్డ్ చేసిన తర్వాత, ఆటను మీ మొబైల్ నంబర్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో UPI తో కనెక్ట్ చేయవచ్చు / నమోదు చేయవచ్చు. అంతేకాదు, మీ డెబిట్ కార్డ్ నంబర్, ATM కార్డ్ పిన్, డెబిట్ కార్డ్ గడువు తేదీ మరియు OTP వంటి ఖాతా వివరాల కోసం అతను మీకు కాల్ కూడా చేయవచ్చు.

ఈ వివరాల్ని పొందడం వలన మీ అకౌంట్ కోసం పర్సనల్ ID లేదా MPIN క్రియేట్ చేయడం వీలవుతుంది. ఇంకేముంది, మీ అకౌంట్ ని పూర్తిగా చేతుల్లోకి తీసుకొని, అమౌంట్ ట్రాన్స్ఫర్, ఆన్లైన్ పేమెంట్ వంటి మరిన్ని పనులు చేయడం వీలవుతుంది.

కొన్ని సందర్భాల్లో మోసగాళ్లు మీ UPI ID లకు 'కలక్షన్ రిక్వెస్ట్' ను పంపించి ఆ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చెయ్యమని కూడా సూచిస్తారు. ఇది మీకు ఏదో అమౌంట్ రిఫండ్ అవుతుందని నమ్మబుచ్చుతారు. వీటిని నమ్మడం వలన మోసపోతారు. వాస్తవం ఏమిటంటే బ్యాంక్ ఎప్పుడు కూడా OTP లేదా మారే ఇతర వివరాల కోసం కస్టమర్లను ఫోన్ ద్వారా సంప్రదించదు.           

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :