డిసెంబర్ 31 వతేది నుండి ఈ ఆండ్రాయిడ్ మరియు iOS ఫోన్లలో Whatsapp పనిచెయ్యదు

Updated on 30-Dec-2019
HIGHLIGHTS

ఈ డివైజులు కొత్త ఖాతాలను నమోదు చేసుకోవాలి లేదా ఉన్న ఖాతాలను తిరిగి "Verify" చేసుకోవాల్సి ఉంటుందని వాట్సాప్ తెలిపింది.

2020 సంవత్సరం వస్తుండగా, Whatsapp రానున్న కొత్త సంవత్సరం నుండి ఆండ్రాయిడ్ మరియు iOS ఫోన్లలో తన సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.   అంతేకాదు, ఎటువంటి ఫోన్లలో ఈ యాప్ పనిచేయదో తెలిపే ఒక జాబితాను కూడా విడుదల చేసింది. దీనిలో, అత్యంత ప్రజాదరణ పొందిన ఈ మెసేజింగ్ యాప్ ను అతిత్వరలో చాలా ఫోన్లలో  ఆపివేయబోతోందని ప్రకటించింది. వాట్సాప్, తన తరచుగా అడిగే ప్రశ్నల విభాగాన్ని అప్‌ డేట్ చేసింది మరియు ఫిబ్రవరి 1, 2020 నుండి ఈ యాప్ కొన్ని ఆండ్రాయిడ్ మరియు iOS పరికరాల్లో పనిచేయడం ఆగిపోతుందని తెలియచేసింది.

ఆండ్రాయిడ్ 2.3.7 మరియు iOS 7 నడుస్తున్న డివైజులు వచ్చే ఏడాది నుంచి వాట్సాప్‌ కు మద్దతు ఇవ్వవని తరచుగా అడిగే ప్రశ్నల విభాగం పేర్కొంది. 1 ఫిబ్రవరి 2020 నుండి ఈ డివైజులు కొత్త ఖాతాలను నమోదు చేసుకోవాలి లేదా ఉన్న ఖాతాలను తిరిగి "Verify" చేసుకోవాల్సి ఉంటుందని వాట్సాప్ తెలిపింది.

ఇది కాకుండా, వాట్సాప్ 31 డిసెంబర్ 2019 నుండి అన్ని విండోస్ ఫోన్ల నుండి అధికారిక మద్దతును ఉపసంహరించుకుంటుంది. 1 జూలై 2019 నుండి మైక్రోసాఫ్ట్ స్టోర్ నుండి ఈ యాప్ తొలగించబడింది.

మీ ఫోను కూడా ఈ జాబితాలో చేర్చబడితే, డిసెంబర్ 31 కి ముందు మీరు మీ చాట్ మరియు సమాచారాన్ని భద్రపరచుకోవాల్సివుంటుంది. మీరు మీడియా లేదా మీడియా ఫైల్స్ లేకుండా చాట్ హిస్టరీని కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

వాట్సాప్ యొక్క ఈ కొత్త దశ ఇబ్బంది పడతామని చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, Android 2.3.7 లేదా Android Gingerbread పైన నడుస్తున్న Android పరికరాలు కేవలం 0.3% మాత్రమే ఉన్నాయి.

ఫేస్‌ బుక్ యాజమాన్యంలోని వాట్సాప్‌ కు కొత్త ఫీచర్ వచ్చింది, అంటే కంపెనీ వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌ ను జోడించింది. ఈ ఫీచర్ ద్వారా, వినియోగదారులు ఇన్‌కమింగ్ కాల్స్ గురించిన సమాచారాన్ని పొందబోతున్నారు. ఇప్పుడు మీరు మరొక కాల్‌ లో ఉంటే, ఈ సమయంలో మీ వాట్సాప్‌లో మీకు మరో కాల్ వస్తే, మీరు నోటిఫికేషన్ అందుకుంటారు, మీరు ఈ కాల్ గురించి తెలుసుకోవచ్చని కూడా చెప్పవచ్చు. అయితే, ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఐఫోన్ వినియోగదారులకు మాత్రమే విడుదల చేయబడింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :