ఢిల్లీతో సహా ఈ నగరాల్లో Vodafone 4G VOLTE సర్వీస్ ను ప్రారంభించింది

వోడాఫోన్ ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, గుజరాత్ సర్కిల్స్ లో  తన 4 జి వోల్ట్ సేవను ప్రారంభించింది. ఇప్పుడు ఈ నగరాల తరువాత  వొడాఫోన్ కర్ణాటక, కోల్కతా సర్కిల్స్లో 4 జి వోల్ట్ సేవలను ప్రారంభించనుంది. అదనంగా, కంపెనీ పేర్కొన్న ప్రకారం కొన్ని నెలల్లో ఈ సేవ అన్ని దేశాలలో దశలవారీగా ప్రారంభమవుతుంది.వోడాఫోన్ యొక్క 4G VoLTE సేవను 4G స్మార్ట్ఫోన్లలో ఉపయోగించవచ్చు. ఈ సేవను ఉపయోగించడానికి, వినియోగదారులు మొట్టమొదటిసారిగా తమ స్మార్ట్ఫోన్లను అప్గ్రేడ్ చేయాలి. దీనికోసం యూజర్ 4G స్మార్ట్ఫోన్ లో  వొడాఫోన్ 4G సిమ్ ని  ఉంచాలి.

ఒకవేళ మీ ఫోన్  డ్యూయల్  SIM అయితే, మీరు వొడాఫోన్ SIM డేటా స్లాట్ లేదా సిమ్ స్లాట్ 1 లో ఉంచాలి. మీ నెట్వర్క్ మోడ్ కూడా '4G / 3G / 2G (ఆటో)' అయి ఉండాలి.

 

 

 

Connect On :