వోడాఫోన్ కంపెనీ త్వరలో తన వినియోగదారులకు కొత్త ప్లాన్ ని ప్రారంభిస్తుంది, దీనిలో వాడుకదారులు రోజుకు 4.5 GB డేటాను పొందుతారు.వోడాఫోన్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ 799 మరియు రూ .549 ప్లాన్లను అందిస్తోంది , ఇవి కంపెనీ యొక్క ప్రస్తుత ప్రణాళికలన్నింటికన్నా ఎక్కువ బెనిఫిట్స్ తో వస్తాయి.
799 రూపీస్ ప్లాన్ –
799 రూపాయల రిలయన్స్ జీయో ప్లాన్ ను ఎదుర్కొనేందుకు వోడాఫోన్ 799 రూపాయల ప్లాన్ ని అందిస్తుంది . జియో యొక్క ఈ ప్లాన్ లో రోజువారీ వినియోగదారులు 5 GB డేటాను పొందుతారు. వోడాఫోన్ ఈ 799 రూపాయల ప్లాన్ 28 రోజుల వాలిడిటీను కలిగి ఉంది, అందులో వినియోగదారులు రోజుకు 4.5GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్ లో వినియోగదారులకి 28 రోజులు 128GB డేటా లభిస్తుంది. అదనంగా, అపరిమిత వాయిస్ కాల్స్ (లోకల్ , STD) అందుబాటులో వున్నాయి . ఇవే కాకుండా, రోజుకి 100 లోకల్ మరియు నేషనల్ SMS రోజువారీ పొందుతారు.
549 రూపీస్ ప్లాన్ –
549 రూపాయల ప్లాన్ లో వినియోగదారులు 4 జి స్పీడ్ తో ప్రతిరోజూ 98 జిబి డేటా మరియు రోజుకి 3.5 జీబీ డేటాను పొందుతారు. ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీ తో వస్తుంది. అదనంగా, అపరిమిత వాయిస్ కాల్స్ (లోకల్ , STD) అందుబాటులో వున్నాయి . ఇవే కాకుండా, 100 లోకల్ మరియు నేషనల్ SMS రోజువారీ పొందుతారు. ఈ ప్లాన్ జియో యొక్క రూ. 509 ప్లాన్ కి కౌంటర్ ప్లాన్ . జియో యొక్క ఈ ప్లాన్ లో, వినియోగదారులు 28 రోజులు మొత్తం 112 GB డేటా పొందుతారు. అపరిమిత కాలింగ్ మరియు SMS లు లభ్యం .