Jio ను వెనక్కి నెట్టిన Vi (వోడాఫోన్ ఐడియా)

Updated on 12-Dec-2020
HIGHLIGHTS

Vi (వోడాఫోన్ ఐడియా) అగ్రస్థానంలో నిలిచింది

నెట్‌వర్క్ కాలింగ్ నాణ్యత విషయంలో ముందంజ

వోడాఫోన్ ఐడియా (VI) ఎయిర్‌టెల్ మరియు జియో నెట్‌వర్క్‌లను అధిగమించింది

భారతదేశంలో టెలికం కంపెనీల మధ్య భీకర పోటీ జరుగుతోంది. ఎయిర్టెల్, జియో మరియు వోడాఫోన్ ఐడియా (VI) మూడు టెలికాం కంపెనీలు  గట్టి పోటీని ఎద్కుర్కొంటున్నాయి. కానీ ఇప్పుడు TRAI నవంబర్‌ కాలింగ్ నాణ్యత గురించి విడుదల చేసిన గణాంకాల ప్రకారం, వోడాఫోన్ ఐడియా నెట్‌వర్క్ కాలింగ్ నాణ్యత విషయంలో ముందంజలో నిలిచింది.

TRAI నవంబర్ గణాంకాల ప్రకారం,వోడాఫోన్ ఐడియా (VI) ఎయిర్‌టెల్ మరియు జియో నెట్‌వర్క్‌లను అధిగమించింది. అంటే,  క్వాలిటీ గల కాలింగ్ అందిస్తున్న టెలికం సంస్థగా Vi (వోడాఫోన్ ఐడియా) అగ్రస్థానంలో నిలిచింది.  

వోడాఫోన్ ఐడియా అందించే 365 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్స్

కస్టమర్లకు లభించే ఉత్తమమైన ఒప్పందాలలో ఒకటి రూ .2595 రీఛార్జ్ ఆఫర్. ఈ ఆఫర్ ఒక సంవత్సరానికి చెల్లుతాయి. వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు రోజుకు 2 జీబీ డేటా రూ .2595 రీఛార్జ్ ద్వారా లభిస్తుంది. అంటే మీరు పూర్తిగా 730GB డేటాను పొందుతారు. అదేవిధంగా, అపరిమిత వాయిస్ కాలింగ్ కూడా  ఈ ఆఫర్లలో లభిస్తుంది.

మరిన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం ఇక్కడ నొక్కండి

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :