వివో అప్ కమింగ్ ఫోన్ Vivo T1X జూలై 20 న విడుదలకు సిద్ధమవుతొంది. వివో టి1ఎక్స్ స్మార్ట్ ఫోన్ ను 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి ఇండియాలో విడుదల చేయనున్నట్లు వివో ప్రకటించింది. Flipkart నుండి ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా ఈ ఫోన్ యొక్క టీజింగ్ కూడా మొదలైయ్యింది. Vivo T1X యొక్క కొన్ని స్పెక్స్ మరియు ఫీచర్లను గురించి కంపెనీ ఈ టీజర్ లో వేళ్లడించింది. Vivo T1X గురించి టీజింగ్ ద్వారా వివో అందించిన వివరాలు ఏమిటో తెలుసుకుందాం.
వైబ్సైట్ పేజ్ ప్రకారం, వివో టి1x స్మార్ట్ ఫోన్ 2.4 GHz క్లాక్ స్పీడ్ కలిగిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ కలిగివుంది మరియు దీనికి జతగా ఒక ఫ్లాష్ లైట్ కూడా వుంది. అలాగే, ఈ ఫోన్ చాలా సన్నని డిజైన్ లో కనిపిస్తోంది మరియు ఎటువంటి హడావిడీ లేకుండా చాలా క్లీన్ డిజైన్ తో కనిపిస్తోంది. ఈ ఫోన్ రెండు కలర్ అప్షన్ లలో రానున్నట్లు కూడా టీజర్ పేజ్ ద్వారా అర్ధమవుతోంది.
అంతేకాదు, ఈ ఫోన్ ఈ ధర సెగ్మెంట్ లో 4 లేయర్ కూలింగ్ సిస్టం కలిగిన మొదటి ఫోన్ అవుతుందని కూడా వివో తెలిపింది. ఈ ఫోన్ లాంచ్ కావడానికి ఇంకా సమయం వున్నది కాబట్టి, వివో ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మరిన్ని వివరాలను లాంచ్ కంటే ముందుగానే ప్రకటించే అవకాశం వుంది. అయితే, Vivo T1X ముందుగానే చైనాలో విడుదల చెయ్యబడింది కాబట్టి ఈ ఫోన్ స్పెక్స్ ను ముందుగానే అంచనా వేస్తున్నారు.
Vivo T1X యొక్క అంచనా స్పెక్స్ గురించి చూస్తే, ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగిన 6.58-ఇంచ్ FHD+ డిస్ప్లేని కలిగి ఉండవచ్చు. ఈ ఫోన్ కూడా అదే మీడియాటెక్ డైమెన్సిటీ 900SoC తో రావచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, 8GB RAM మరియు 256GB స్టోరేజ్ తో కూడా జత చేయబడుతుందని ఊహిస్తున్నారు.