మొండికేసిన Google Meet తో ఇబ్బంది పడుతున్న యూజర్లు.!

HIGHLIGHTS

వీడియో మీటింగ్ ప్లాట్ ఫామ్ Google Meet ఇప్పుడు డౌన్ అయ్యింది

గూగుల్ యొక్క వీడియో మీటింగ్ ప్లాట్ ఫామ్ Google Meet ఇప్పుడు డౌన్ అయ్యింది. ఆఫీస్ మరియు జనరల్ పర్పస్ కోసం ఎక్కువగా ఉపయోగించే ఈ ప్లాట్ ఫామ్ డౌన్ అయ్యిందని మరియు దీని కారణంగా ఇక్కట్లు పడుతున్నట్లు యూజర్లు దీని గురించి downdetector సాక్షిగా రిపోర్ట్ చేస్తున్నారు. అయితే, ఇది జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయినట్లు చెబుతున్నారు. ఇది క్విక్ రికవరీ చేస్తుందా లేక రీసెంట్ గా జరిగిన క్లౌడ్ ఫ్లేర్ అవుటేజ్ మాదిరిగా దీర్ఘకాలం కొనసాగుతోంది చూడాలి.

Google Meet డౌన్ ఎప్పుడు అయ్యింది?

గూగుల్ మీట్ ఈరోజు ఉదయం 11 గంటల నుంచి డౌన్ అయినట్లు యూజర్లు డౌన్ డిక్టేటర్ నుంచి యూజర్లు రిపోర్ట్ చేయడం ప్రారంభించారు. ఇక్కడ నుంచి గూగుల్ మీట్ డౌన్ గురించి రిపోర్ట్ పెరుగుతూ మధ్యాహ్నం 12 గంటల సమయానికి పీక్ చేరుకుంది. ఇందులో పీక్ టైమ్ లో నిముషానికి 1709 మంది యూజర్లు కంప్లైంట్ చేసినట్లు చూపించింది. అయితే, గూగుల్ మీట్ ఇప్పుడు మెల్ల మెల్లగా రికవర్ అవుతున్నట్లు కొందరు యూజర్లు చెబుతున్నారు. అయితే, కంప్లీట్ రికవరీ అప్డేట్ రావాల్సి ఉంది.

Google Meet ఏమిటి?

గూగుల్ మీట్ అనేది గూగుల్ అందించే ఒక వీడియో మీటింగ్ (వీడియో కాన్ఫరెన్సింగ్) ప్లాట్‌ ఫామ్. దీని ద్వారా మీరు ల్యాప్‌ టాప్, మొబైల్, టాబ్లెట్ లేదా ఇతర డివైస్ నుంచి వీడియో కాల్ చేయవచ్చు. ఇది HD వీడియో కాల్ కోసం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా, ఇది ఎక్కువ మంది ఒకేసారి కాల్ నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఒకే లింక్‌తో 100 నుంచి 500 మంది వరకు మీటింగ్‌లో ఒకేసారి చేరవచ్చు. అందుకే, ఈ ప్లాట్ ఫామ్ పై ఆఫీస్, స్టూడెంట్ మరియు ఇతర యూజర్లు ఎక్కువ ఆధారపడుతున్నారు.

Also Read: Realme P4x : ఫాస్ట్ చిప్ సెట్ మరియు బిగ్ బ్యాటరీతో వస్తుంది.!

ఇందులో స్క్రీన్‌ను షేర్ చేసి ప్రెజెంటేషన్స్ చూపించవచ్చు మరియు వెనుక నుని వచ్చే బ్యాగ్రౌండ్ శబ్దాలను తగ్గించే నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా ఉంటుంది. ఇది మాత్రమే కాదు మాట్లాడిన మాటలను ఆటోమేటిక్‌గా టెక్స్ట్‌గా చూపిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :