Major తో సహా జూన్ 3న పోటాపోటీగా వస్తున్న కొత్త సినిమాలు..!!

Updated on 01-Jun-2022
HIGHLIGHTS

జూన్ 3 న థియేటర్లలో భారీ సందడి నెలకొననుంది.

మూడు భారీ చిత్రాలు ఒకేరోజు థియేటర్లలో విడుదల అవుతున్నాయి

'Major' తో పాటు 'విక్రమ్' మరియు 'పృథ్వి రాజ్' జూన్ 3 న థియేటర్లలో విడుదలవుతున్నాయి

జూన్ 3 న థియేటర్లలో భారీ సందడి నెలకొననుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా ‘అడవి’ శేష్  హీరోగా నటించిన  'Major' తో పాటు కమల్ హాసన్, విజయ్ సేతుపతి మరియు ఫహద్ ఫాసిల్ కలిసి నటించిన 'విక్రమ్' మరియు సామ్రాట్ పృథ్వి రాజ్ గా అక్షయ్ కుమార్ నటించిన 'పృథ్వీరాజ్' కూడా ఒకేరోజు థియేటర్లలో విడుదల అవుతున్నాయి. ఈ మూడు సినిమాలు కూడా ఇప్పటికే సినిమా ట్రైలర్స్ తో ప్రేక్షకులను మైమరపించాయి. ఇక థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. మరి ఈ మూడు సినిమాలు వాటి సంగతులు ఏమిటో చూద్దామా.  

Major

'Major' సినిమా 26/11 ముంబై దాడిలో వీర మరణం పొందిన 'సందీప్ ఉన్ని కృష్ణన్' జీవిత వృత్తాంతాన్ని (బయో పిక్) సినిమాగా నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ అయితే ఒక రేంజ్ లో వుంది మరియు 26/11 ముంబై దాడి కధానాలను కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా, శశి కిరణ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది.

Vikram

చాలాకాలం తరువాత కమల్ హాసన్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్ సినిమాగా 'Vikram' వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ తో మరింత హైప్ అంధుకుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి మరియు ఫహద్ ఫాసిల్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ నిర్మాణంలో లొకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపు దిద్దుకుంది.

సామ్రాట్ పృథ్వీ రాజ్

సామ్రాట్ పృథ్వీ రాజ్ చౌహన్ జీవితం ఆధారంగా నిర్మిచిన చారిత్రక యాక్షన్ డ్రామా సినిమా ఈ 'సామ్రాట్ పృథ్వీ రాజ్'. పృథ్వీ రాజ్ చౌహన్ గా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించగా సంజయ్ దత్ మరియు సోనూ సూద్ ప్రధాన పాత్రలను పోషించారు. ఈ చిత్రాన్ని చంద్ర ప్రకాష్ దివేది దర్సకత్యంలో భారీ బడ్జెట్ తో యష్ రాజ్ ఫిలింస్ నిర్మించింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :