గడిచిన నెల (ఏప్రిల్) లో చాలా బ్లాక్ బాస్టర్ సినిమాలు థియేటర్లతో పాటుగా OTT లో కూడా సందడి చేశాయి. అయితే, ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు సృష్టించిన RRR, KGF: చాఫ్టర్ 2 వంటి భారీ చిత్రాల OTT రిలీజ్ డేట్ కోసం అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ సినిమాలు OTT రిలీజ్ డేట్స్ ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించబడలేదు. కానీ, మే నెలలో కూడా మంచి సినిమాలు OTT లో రానున్నాయి. మరి ఈ నెలలో ఓటీటీ లో సందడి చెయ్యనున్న మరియు రిలీజ్ కానున్నట్లు అంచనా వేస్తున్న కొత్త సినిమాలను గురించి తెలుసుకుందామా.
మంచి సినిమా ఏ భాషలో వున్నా దాన్ని డబ్బింగ్ చేసే ప్రేక్షకులకు అందించడంలో AHA అందరికంటే ముందుంటోంది. ఇప్పుడు ఇదే క్రమంలో నేషనల్ అవార్డ్ గెలుచుకున్న గొప్ప చిత్రాన్ని డబ్బింగ్ చేసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతోంది. ఫహద్ ఫాజిల్ నటించిన 'తొందిముత్తాళం ద్రిక్షాక్షియుం' మలయాళీ మూవీని ఇప్పుడు తెలుగులో 'దొంగాట; పేరుతో మే 6 నుండి AHA లో స్ట్రీమింగ్ చేయబోతోంది.
ఎటువంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా 2022 లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఊహించని భారీ కలక్షన్ లతో పాటుగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందించింది. ఇక విషయానికి వస్తే, 1990 ల కాలంలో కశ్మిర్ నుండి అక్కడి పండితులు వలస వెళ్ళవలసి వచ్చిన పరిస్థితులు మరియు వారు ఎదుర్కొన్న సంఘటనలను ఈ చిత్రం చూపించారు. ఈ సినిమా మే 13 నుండి ZEE 5 లో రిలీజ్ అవుతుంది.
ఇక మే నెలలో రిలీజ్ కానున్నట్లు అంచనా వేస్తున్న సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న రూమర్లు మరియు రిపోర్ట్స్ చెబుతున్నట్లు కనుక జరిగితే, KGF: చాఫ్టర్ 2 సినిమా మే 27న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కావచ్చు. వాస్తవానికి, KGF: చాఫ్టర్ 2 OTT రిలీజ్ గురించి ఇప్పటి వరకూ ఎటువంటి అధికారిక ప్రకటన కూడా బయటికి రాలేదు. అంతేకాదు, KGF: చాఫ్టర్ 2 ఇప్పటికి ధియేటర్ల వద్ద భారీ కలక్షన్స్ వసూలు చేస్తోంది. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 1,000 కోట్లు వసూలు చేసింది మరియు ఇంకా భారీ కలక్షన్స్ సాధించే అంచనాలతో సాగుతోంది.