AC, రిఫ్రిజిరేటర్లు మరియు కూలర్ల పైన 50% వరకూ డిస్కౌంట్ : అమేజాన్ సమ్మర్ అప్లయన్సెస్ కార్నివాల్ సేల్ ఎఫెక్ట్

Updated on 12-Mar-2020

అమేజాన్ ఇండియా తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన సమ్మర్ సేల్ ని ప్రకటించింది. సమ్మర్ సేల్ కోసం ఎదురు చూస్తున్నవారిలో మీరు ఒకరైతే ఇది మీకు శుభవార్తే అవుతుంది. ఎందుకంటే, అమేజాన్ ఇండియా ఈ సేల్ ద్వారా అనేకమైన ప్రొడక్టుల పైన గొప్ప డిస్కౌంట్ తో పాటుగా, మంచి బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. ఇందులో, AC లు, AC, రిఫ్రిజిరేటర్లు మరియు కూలర్ల వాటి వాటిపైన భారీ ఆఫర్లను ప్రకటించింది.                  

ఈ సేల్, ఈరోజు అంటే మార్చ్ 12 మొదలుకొని మార్చ్ 15 వ తేదికి వరకూ జరగనుంది. ఈ సేల్ నుండి AC, రిఫ్రిజిరేటర్లు మరియు కూలర్ల పైన 50% వరకూ డిస్కౌంట్ ని ప్రకటించింది. అంతేకాదు, ICICI బ్యాంక్ యొక్క డెబిట్ మరియు క్రెడిట్ కార్డు EMI ల ద్వారా కొనేవారి కోసం, గరిష్టంగా 1,500 రుపాయల వరకూ అధనపు తక్షణ డిస్కౌంట్ ని కూడా ప్రకటించింది. ఈ సేల్ నుండి అతి తక్కువ ధరకే AC, రిఫ్రిజిరేటర్లు మరియు కూలర్లను సొంతం చేసుకునే అవకాశం మీకు దొరుకుతుంది.

ఇందులో, ఫిక్సెడ్ స్ప్లిట్ AC ని కేవలం రూ. 21,999 ప్రారంభదరతో కొనవచ్చని ప్రకటించింది. అలాగే, ఇన్వర్టర్ AC ని 23,999 రుపాయల ప్రారంభదరతో చూపిస్తోంది. ఇక విండో AC ల విషయానికి వస్తే వీటిని కేవలం రూ. 17,490 రుపాయల స్టార్టింగ్ ధరతో ప్రకటిస్తోంది.  రిఫ్రిజిరేటర్ల పైన కూడా భారీగానే డిస్కౌంట్ అందిస్తోంది. ఈ విభాగంలో, LG, శామ్సంగ్, వర్ల్ పూల్, Haier, గోద్రెజ్ మరియు మరిన్ని బ్రాండెడ్ రిఫ్రిజిరేటర్ల పైన గరిష్టంగా 35% వరకూ డిస్కౌంట్ తో పాటుగా, గరిష్టంగా 12,000 రుపాయల్ వరకూ ఎక్స్చేంజి ని కూడా ప్రకటించింది.                                    

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :