Ugadi 2025: మీ ప్రియమైన వారికి పంపదగిన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు మరియు ఇమేజస్.!

Updated on 30-Mar-2025
HIGHLIGHTS

తెలుగు వారందరికీ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు

Ugadi 2025 ఈరోజు నుంచి తెలుగువారికి “విశ్వావసు నామ సంవత్సరం” మొదలవుతుంది

మీ ప్రియమైన వారికి పంపదగిన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు మరియు ఇమేజస్

Ugadi 2025: ముందుగా తెలుగు వారందరికీ “తెలుగు సంవత్సరాది, ఉగాది శుభాకాంక్షలు”. ఈరోజు నుంచి తెలుగువారికి “విశ్వావసు నామ సంవత్సరం” మొదలవుతుంది. మొత్తం 60 తెలుగు సంవత్సరాలు ఉండగా ఈరోజు నుంచి మొదలైన విశ్వావసు నామ సంవత్సరం 39 వ సంవత్సరం అవుతుంది. అలాగే, ఈ సంవత్సరానికి అధిపతి సూర్యుడు మరియు ఈ సంవత్సరం శుభప్రదంగా ఉంటుందని పంచాంగం చెబుతోంది. మరి ఈ శుభాల సంవత్సరం ఆరంభమైన ఈరోజు మీ ప్రియమైన వారికి పంపదగిన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు మరియు ఇమేజస్ ను మీకోసం అందిస్తున్నాము.

Ugadi 2025 శుభాకాంక్షలు

ఈ విశ్వావసు నామ సంవత్సరం మొత్తం మీ కుటుంబం సుఖ సంతోషాలతో గడపాలని ఆశిస్తున్నాను!

ఈ కొత్త సంవత్సరం మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శుభప్రదంగా సాగాలని కోరుకుంటూ, ఉగాది శుభాకాంక్షలు!

2025 ఉగాది పండుగ మీకు సంతోషం నింపే సంవత్సరం కావాలని కోరుకుంటూ, ఉగాది శుభాకాంక్షలు

ఈ విశ్వావసు నామ సంవత్సర ఉగాది మీ జీవితంలో సరికొత్త ఆశలు మరియు విజయాలు తీసుకురావాలని ప్రార్ధిస్తున్నాను!

2025 ఉగాది మీ ఆశలు మరియు ఆశయాలకు కావాలి ఆది, మీకు మరియు కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు!

ఈ విశ్వావసు నామ సంవత్సరం మీ చిరకాల కోరికలు నెరవేరాలని కోరుకుంటూ, ఉగాది 2025 శుభాకాంక్షలు!

ఈ నూతన సంవత్సరం మీకు కొత్త అవకాశాలు మరియు కొత్త కలలు తీసుకు రావాలని కోరుకుంటూ మీకు ఉగాది 2025 శుభాకాంక్షలు!

ఈ కొత్త తెలుగు సంవత్సరాది కావాలి అందరికీ వెలుగు నింపే సూర్యావళి.. అందరికీ 2025 ఉగాది పండుగ శుభాకాంక్షలు!

Also Read: LG Soundbar: ఇంటిని షేక్ చేసే 600W సౌండ్ బార్ ను డిస్కౌంట్ ధరలో అందుకోండి.!

Ugadi 2025 ఇమేజస్

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :