ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించిన టాప్ 10 పాస్‌వర్డ్‌లు ఇవే..!!

Updated on 01-Apr-2022
HIGHLIGHTS

ఒకేవిధమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నారు

అత్యంత ప్రమాదకరమైన పాస్‌వర్డ్‌ జాబితా

సులభంగా ఉండే పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం ప్రమాదకరం

మన పాస్‌వర్డ్‌ ఎంత పటిష్టంగా ఉంటుందో మన డేటా లేదా బ్యాంక్ వివరాలు లేదా ఇంకేదైనా ముఖ్యమైన వివరాలు అంత సేఫ్ గా ఉంటాయి. అయితే, చాలా మంది పేలవమైన పాస్‌వర్డ్‌ లను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. మనలో చాలామంది వారి ఫోన్, ఇమెయిల్, సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ తో సహా మరిన్ని వాటికి ఒకేవిధమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నారు. అవి ఏమిటి అని ఆలోచనలో పడ్డారా? దీని కోసమే ఒక సెక్యూరిటీ సంస్థ గుర్థించిన అత్యంత ప్రమాదకరమైన పాస్‌వర్డ్‌ జాబితాను వెల్లడించింది. మరి, ఆ ప్రమాదకరమైన పాస్‌వర్డ్‌ లిస్ట్ మరియు వాటి కథ ఏమిటో తెలుసుకుందామా..!

ఇటీవల యునైటెడ్ కింగ్డమ్ (UK) యొక్క నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ గత 12 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా ఉపయోగించే పాస్‌వర్డ్‌ల జాబితాను విడుదల చేసింది. అంతేకాదు, వీటిని ఎందుకు ఉపయోగిస్తారనే విషయాన్ని కూడా వెల్లడించింది. అసలు కారణం ఏమిటంటే, కేవలం గుర్తుంచుకోవడానికి సులభంగా ఉండడానికి ఈ పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నట్లు ఈ సంస్థ గుర్తించింది.

వాస్తవానికి, గుర్తుంచుకోవడానికి సులభంగా ఉంటుందని చాలా సులభంగా ఉండే పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం ప్రమాదకరం అని కూడా ఈ సంస్థ పేర్కొంది. మరి ఈ లిస్ట్ లో అందించిన ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించిన అత్యంత ప్రమాదకరమైన 10 పాస్‌వర్డ్‌లను ఈ క్రింద చూడవచ్చు.

ప్రమాదకరమైన 10 పాస్‌వర్డ్‌ జాబితా:

123456

123456789

qwerty

password

12345

qwerty123

1q2w3e

12345678

111111

1234567890    

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :