గత వారంతో పోలిస్తే ఈ వారం బంగారం ధర పైకి ఎగబాకుతోంది. గత ఆదివారం వరకూ నెలకు చూపులు చూసిన బంగారం సూచీలు ఈ వారం ప్రారంభం నుండి పైకి చూస్తున్నాయి. మార్చి 21 సోమవారం నాడు రూ.47,300 రూపాయల వద్ద ప్రారంభమైన బంగారం ధర ఈరోజు రూ.48,200 వద్దకు చేరుకుంది. అంటే, ఈ 5 రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర 900 రూపాయల పైచిలుకు పెరిగింది.
గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, గతవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,300 రూపాయలుగా ఉండగా, నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,200 రూపాయలుగా ఉంది. అలాగే, గతవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600 కాగా, నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,590 గా ఉంది. అంటే, ఒక వారంలో 10 గ్రాముల బంగారం ధర దాదాపుగా 990 రూపాయల వరకూ పెరిగింది.
ఇక ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,590 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్నిఇతర ప్రధాన నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా ఉంది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,540 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,960 గా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,590 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,590 గా ఉంది.