శనివారం వరకూ బంగారం ధర కొంత నిలకడగా సాగినా, ప్రస్తుతం మళ్ళి కొంచెం కొంచెంగా పైకి ఎగబాకుతోంది. అయితే, ఈ నెల ప్రారంభంలో పెరిగిన ధరతో పోలిస్తే మాత్రం ఇప్పటికి బంగారం ధర 3,000 తక్కువగా వుంది. కానీ,గత వారంతో పోలిస్తే ఈ వారం బంగారం ధర కొంచెం పెరిగింది. ఈ నెల ప్రారంభంలో బంగారం ధర తో పోలిస్తే ఈరోజు అదే రేటుతో కొనసాగుతోంది. అయితే, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో మార్చి 4 నుండి మార్చి వరకూ కొనసాగింది మరియు తరువాత తగ్గుముఖం పట్టింది.
గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, గతవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,300 రూపాయలుగా ఉండగా, నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,750 రూపాయలుగా ఉంది. అలాగే, గతవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600 కాగా, నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,100 గా ఉంది. అంటే, ఒక వారంలో 10 గ్రాముల బంగారం ధర దాదాపుగా 450 రూపాయల వరకూ పెరిగింది.
ఇక ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,100 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్నిఇతర ప్రధాన నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా ఉంది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,240 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,670 గా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,100 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,100 గా ఉంది.