Gold Price: ఈరోజు బంగారం ధర…ఎంతంటే..!

Updated on 16-Mar-2022
HIGHLIGHTS

తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరలు

మరింతగా తగ్గుతున్న బంగారం ధర

హైదరాబాద్ మరియు విజయవాడ Gold Price వివరాలు

నేటికాలంలో పెట్టుబడులు పెట్టేవారికి బంగారం ఒక ముఖ్యమైన పెట్టుబడిగా మారింది. అందుకే, పెట్టుబడిదారులు మరియు కొనుగోలుదారులతో సహా ప్రతి ఒక్కరూ కూడా రెగ్యులర్ గా గోల్డ్ అప్డేట్స్ మరియు ధర వివరాలను ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ వివాదం కారణంగా దేశంలో బంగారం ధర పెరుగుతూ వచ్చింది. అయితే, కొద్ధి రోజుల్లోనే భారతీయులకు అధిక బంగారం ధర నుండి కొంత ఊరట లభించింది.

గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,100 రూపాయలుగా ఉండగా, నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,090 రూపాయలుగా ఉంది. అలాగే, నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,470 కాగా, నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,460 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,600 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,930 గా ఉంది. దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా ఉంది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,190 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,570 గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,600 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,930గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,600 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,930గా ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :