Timex నుండి వచ్చిన iConnect Active : ధర రూ.4,995

Updated on 18-Mar-2020
HIGHLIGHTS

లైట్‌వెయిట్ కేస్ డిజైన్ మరియు ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్‌ తో వస్తుంది.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు సొగసైన డిజైనుయొక్క సంపూర్ణ సమ్మేళనంతో, టైమెక్స్ కలక్షన్స్ ద్వారా కొత్త iConect ™ యాక్టివ్ ఫిట్‌నెస్ వినియోగదారులకు స్మార్ట్ విధానాలతో  ఆరోగ్యకరమైన జీవనశైలిలోకి నడిపించడంలో వారికి సహాయపడుతుంది. ఈ సరికొత్త కలక్షన్ 37 MM గ్రాఫికల్ కలర్ డిస్ప్లే, లైట్‌వెయిట్ కేస్ డిజైన్ మరియు ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్‌ తో వస్తుంది. వీటితో పాటు, ఈ కొత్త కలక్షన్ క్రీడలు సమగ్ర ఆరోగ్య మరియు ఫిట్‌నెస్ ఫీచర్లు స్టెప్స్ & డిస్టెన్స్ ట్రాకర్, కేలరీస్ ట్రాకర్, స్లీప్ ట్రాకర్, స్పోర్ట్ మోడ్ మరియు మ్యూజిక్ కంట్రోలర్ వంటివి వినియోగదారులకు వారి ఆరోగ్య పరిరక్షణని సరిగ్గా ఉంచడంలో సహాయపడతాయి.

వాతావరణ సూచన, ఫోన్ కోసం సెర్చ్ చేయడం  మరియు ఇమెయిల్‌ లు, టెక్స్ట్ మెసేజిలు , కాల్స్ మరియు ఇతర సోషల్ మీడియా యాప్స్ కోసం స్మార్ట్ నోటిఫికేషన్‌ లు వంటి ముఖ్యమైన లక్షణాలతో ఈ కలక్షన్ వస్తుంది. ఈ గడియారాలు, బ్లాక్, సిల్వర్, నేవీ, రోజ్ గోల్డ్ మరియు లిలక్ – వంటి విస్తృతమైన రంగు పట్టీలతో అందుబాటులో ఉన్నాయి.

ఇది INR 4,995 ధరతో, టైమెక్స్ కలక్షన్ ద్వారా కొత్త ఐకనెక్ట్ యాక్టివ్ టైమెక్స్ వరల్డ్ స్టోర్స్, ఆధునిక రిటైల్ దుకాణాలు మరియు అన్ని ఇతర అధీకృత టైమెక్స్ రిటైలర్లలో లభిస్తుంది. ఆన్‌లైన్‌లో ఈ కలక్షన్ shop.timexindia.com లో కూడా అందుబాటులో ఉంది

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :