Realme C 11 స్మార్ట్ ఫోనుతో తో పాటుగా భారతదేశంలో Realme 30w Power Bank డార్ట్ ఛార్జ్ 10,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్‌ను కూడా రియల్ మీ లాంచ్ చేసింది. ఈ పోర్టబుల్ పవర్ బ్యాంక్ Two Way ఫాస్ట్ ఛార్జింగ్ కి మద్దతు ఇస్తుంది, అంటే ఇది 30W తో వేగంగా ఛార్జ్ చేయ్యడమేకాకుండా అంతే వేగంగా తన బ్యాటరీని కూడా ఛార్జ్ చేయ్యగలుగుతుంది. ఈ డార్ట్ ఛార్జ్ పవర్ బ్యాంక్ ఫాస్ట్ రీఛార్జింగ్ ను అందించే విషయంలో టెక్నాలజీ పరంగా మరింత అభివృద్ధి చెందినదే అయినా, డిజైన్ పరంగా చూస్తే మాత్రం 18W రియల్ మీ పవర్ బ్యాంక్ 2 మాదిరిగానే ఉంటుంది.
రియల్ మీ లాంచ్ చేసిన ఈ 30W డార్ట్ ఛార్జ్ పవర్ బ్యాంక్ 13-లేయర్ ఛార్జింగ్ రక్షణను కలిగి ఉంది. ఇది పవర్ బ్యాంక్‌ను తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వోల్టేజ్ హెచ్చుతగ్గులు, ఎలెక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ మరియు మరెన్నో ప్రమాదాల నుండి రక్షిస్తుంది. ఈ పవర్ బ్యాంక్ 3D కర్వ్డ్ డిజైన్‌ను కలిగి ఉంది మరియు ఇది కేవలం 17 మిమీ మందం మరియు 230 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. ఇది కార్బన్ ఫైబర్ ఫినిషింగ్ కలిగి ఉంది, ఇది గ్రిప్పి డిజైన్ ఇస్తుంది. ఈ Realme 30W డార్ట్ ఛార్జ్
10,000mAh పవర్ బ్యాంక్ రెండు రంగులలో లభిస్తుంది – పసుపు మరియు నలుపు .
కేవలం రియల్ మీ యొక్క స్వంత స్మార్ట్ ఫోన్ లైనప్ మాత్రమే కాకుండా, ఈ డార్ట్ ఛార్జ్ పవర్ బ్యాంక్, వన్ ప్లస్ మరియు ఒప్పో యొక్క స్మార్ట్ ఫోన్ సిరీస్ లకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ పవర్ బ్యాంక్ మల్టి ఛార్జింగ్ అవసరాలకు మద్దతు ఇస్తుంది, అంటే మీరు USB-A మరియు USB-C రెండు పోర్ట్స్ ద్వారా ఒకేసారి రెండు పరికరాలను ఛార్జ్ చేయవచ్చు.
డార్ట్ ఛార్జ్ పవర్ బ్యాంక్ మరియు పవర్ బ్యాంక్ 2 మధ్య గల తేడాల విషయానికి వస్తే, ఈ డార్ట్ ఛార్జ్ పవర్ బ్యాంక్ 4,000 నుండి 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ గల స్మార్ట్ ఫోన్ లేదా పరికరాలను 66.7% రెట్లు వేగంగా ఛార్జ్ చేయగలడు మరియు కేవలం 96 నిమిషాల్లో ఈ పవర్ బ్యాంక్ పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఈ పవర్ బ్యాంక్ అధిక-సాంద్రత కలిగిన లిథియం-ఐయాన్ బ్యాటరీలతో తయారు చేయబడింది, ఇది మీ ఫోన్, గేమింగ్ కన్సోల్ మరియు ఇతర పరికరాలను వేగవంతంగా ఛార్జ్ చేయగల సత్తాకలది మరియు సమర్థవంతమైన ఛార్జింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
రియల్ మీ యొక్క 30W డార్ట్ ఛార్జ్ 10,000 ఎమ్ఏహెచ్ పవర్ బ్యాంక్ భారతదేశంలో రూ .1,999 ధరతో, పసుపు మరియు నలుపు వంటి రెండు రంగులలో వస్తుంది. మొదటి అమ్మకం జూలై 21 న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్ మరియు realme.com లో జరపడానికి షెడ్యూల్ చేయబడింది.