Telangana govt could start new QR Code based Electricity Bill to users
గత నెల వరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరెంట్ బిల్లు చెల్లింపు కోసం థర్డ్ పార్టీ UPI యాప్స్ ను ఉపయోగించి చాలా సులభంగా చెల్లింపు చేసే వారు. అయితే, RBI కొత్త ఆదేశాల మేరకు UPI లేదా మరే ఇతర థర్డ్ పార్టీ యాప్ ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించే అవకాశం ఉండదు. దీనికోసం, ప్రభుత్వ పవర్ సంస్థలకు సంబంధించిన అధికారిక యాప్స్ లేదా అధికారిక వెబ్సైట్ ల ద్వారా మాత్రమే చెల్లించాలి. అయితే, ఇది కస్టమర్లను అయోమయంలో పడేసింది. అందుకే, చాలా సింపుల్ గా Electricity Bill చెల్లింపు కోసం QR కోడ్ బిల్స్ ను తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
జూలై 1 నుండి ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా UPI యాప్స్ ద్వారా కాకుండా అధికారిక యాప్స్ మరియు సైట్ ద్వారా కరెంట్ బిల్స్ చెల్లించేలా రూల్స్ వచ్చాయి. దీనికోసం కరెంట్ బిల్స్ ను ఆన్లైన్లో లేదా యాప్స్ ద్వారా ఎలా చెల్లించాలో కూడా తెలియ చేశాయి. అయితే, చాలా మంది సామాన్య ప్రజలకు ఈ పేమెంట్ ను ఎలా చెయ్యాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అయితే, కొంత మంది మీ సేవా కేంద్రాల సహాయంతో కట్టుకున్నారు.
అందుకే, ప్రజలకు అలవాటైన ‘స్కాన్ కొట్టు బిల్లు కట్టు’ అనే పద్ధతిలో కొత్త విధానం తీసుకువస్తోంది తెలంగాణ ప్రభుత్వం. దీనికోసం, QR Code లతో కూడిన కరెంట్ బిల్లులు ప్రజలకు అందిస్తుంది. ఈ కరెంట్ బిల్లు లో వుండే QR కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా పేమెంట్ చేయవచ్చు.
Also Read: BSNL: పెరిగిన ప్రైవేట్ టెలికాం రీఛార్జ్ రేట్లు.. పోటీ లేని ప్రభుత్వ టెలికాం చవక ప్లాన్స్ ఇవే.!
ది సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TGSPDCL) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా కరెంట్ బిల్స్ కట్టడానికి యూనిక్ సర్వీస్ కనెక్షన్ నెంబర్ ను ఉపయోగించ వలసి వస్తుంది. అయితే, ఏ తలపోటు లేకుండా జస్ట్ స్కాన్ చేసి పేమెంట్ చేసే పద్దతే, క్యూఆర్ కోడ్ స్కాన్ పేమెంట్.
క్యూఆర్ కోడ్ ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించడం ఎప్పటి నుండో దేశ రాజధాని ఢిల్లీలో అమలులో ఉంది. ఏదైనా థర్డ్ యాప్స్ (UPI ) మరియు బ్యాంక్ యాప్స్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నేరుగా పేమెంట్ చేసే అవకాశం ఉంటుంది.