తక్కువ బడ్జెట్ లో 7000 mAh బ్యాటరీతో వచ్చే గేమింగ్ ఫోన్ కోసం చూస్తున్నారా..!!

Updated on 04-Jul-2022
HIGHLIGHTS

తక్కువ బడ్జెట్ లో 7000 mAh బ్యాటరీతో వచ్చే గేమింగ్ ఫోన్

రూ.11,499 రూపాయల చవక ధరలోనే భారీ 7000 mAh బ్యాటరీని కలిగివుంది

మీడియాటెక్ గేమింగ్ ప్రాసెసర్ వంటి మరిన్ని వివరాల పరంగా కూడా ఆకట్టుకుంటుంది

తక్కువ బడ్జెట్ లో 7000 mAh బ్యాటరీతో వచ్చే గేమింగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, టెక్నో ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన Tecno Pova 3 పైన ఒక లుక్ వేయవచ్చు. ఎందుకంటే, ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.11,499 రూపాయల చవక ధరలోనే భారీ 7000 mAh బ్యాటరీని కలిగివుంది. అంతేకాదు, మీడియాటెక్ గేమింగ్ ప్రాసెసర్ వంటి మరిన్ని వివరాల పరంగా కూడా ఆకట్టుకుంటుంది. మరి ఈ లేటెస్ట్ బిగ్ బ్యాటరీ గేమింగ్ ఫోన్ పైన ఒక లుక్ వేద్దామా.   

Tecno Pova 3:

ముందుగా టెక్నో పోవా 3 ధర విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 11,499 రూపాయల ప్రారంభ ధరతో విడుదల చెయ్యబడింది. ఈ ధర 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ వేరియంట్ కోసం నిర్ణయించబడింది. అలాగే, 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఈరోజు అమెజాన్ నుండి ఈ ఫోన్ ను Citi బ్యాంక్ క్రెడిట్/ డెబిట్ కార్డ్ తో కొనేవారికి 1,500 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంతేకాదు, భారీ ఎక్స్ చేంజ్ అఫర్ కూడా అందించింది. Buy From Here    

Tecno Pova 3: స్పెక్స్

టెక్నో పోవా 3 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.9 ఇంచ్ FHD+ డాట్ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంటుంది. ఈ ఫోన్ వేగవంతమైన గేమింగ్ ప్రాసెసర్ Helio G88 శక్తితో పనిచేస్తుంది. అంతేకాదు, దీనికి జతగా 6GB ర్యామ్ మరియు 5GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ ను కూడా జత చేసినట్లు కంపెనీ ప్రకటించింది. టెక్నో పోవా 3 అతిపెద్ద 7000 mAh బ్యాటరీని 33W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 14 గంటల గేమింగ్ సమయాన్ని అందిస్తుందని కూడా టెక్నో పేర్కొంది.

కెమెరా పరంగా, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఈ సెటప్ లో 50MP మైన్ కెమెరాకి జతగా మరొక రెండు కెమరాలు ఉంటాయి మరియు క్వాడ్ LED ఫ్లాష్ కూడా వుంది. సెల్ఫీల కోసం ముందుభాగంలో 8MP సెల్ఫీ కెమెరాని అందించింది. గేమింగ్ కోసం 4D వైబ్రేషన్ Z-Axiz లీనియర్ మోటార్ మరియు DTS సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కూడా ఈ ఫోన్ కలిగి వుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :