some scammers using India-Pak Conflict these name and attacking on mobiles
India-Pak Conflict: భారత్ – పాక్ పోరు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. నిన్న రాత్రి జమ్మూ ఎయిర్ పోర్ట్, పఠాన్‌కోట్ మరియు మరిన్ని ప్రాంతాల్లో డ్రోన్స్ మరియు క్షిపణులతో పాకిస్తాన్ అటాక్ చేసింది. అయితే, భారత్ కు ఉక్కుకవచంగా నిర్మించిన USA Grid మరియు S-400 సిస్టం ఈ అటాక్ ను పూర్తి స్థాయిలో తిప్పికొట్టాయి. అయితే, ఈ విజువల్స్ లేదా ఇతర వివరాల విజువల్స్ కోసం చాలా మంది ఆన్లైన్ సెర్చ్ చేస్తున్నారు. సరిగ్గా ఇదే విషయాన్ని టార్గెట్ చేసుకుని కొంత మంది సైబర్ నేరగాళ్లు భారత్ – పాక్ పోరు వీడియోస్ లేదా ఎక్స్ క్లూజివ్ ఇన్ఫర్మేషన్ పేరుతో మోసాలకు తెగబడుతున్నట్లు కొంత మంది రిపోర్ట్ చేస్తున్నారు.
వాట్సాప్ లో రీసెంట్ గా జరుగుతున్న కొత్త స్కామ్ గురించి రిపోర్ట్ చేస్తూ ఒక ఆడియో రికార్డ్ ఎక్కువగా షేర్ అవుతోంది. ఇది హిందీ భాషలో రికార్డు చేయబడిన ఆడియో ఇన్ఫర్మేషన్. ఇందులో ఒక మహిళ భారత్ – పాక్ పోరు విజువల్స్ లేదా వీడియో లేదా ఇన్ఫర్మేషన్ పేరుతో స్కామర్లు లింక్స్ చేస్తున్నట్లు రిపోర్ట్ చేసింది. ఈ లింక్ పై క్లిక్ చేసిన వెంటనే స్కామర్లు ఫోన్ ను వారి చేతుల్లోకి తీసుకుని అకౌంట్ ఖాళీ చేస్తున్నట్లు ఈ ఆడియో మెసేజ్ చెబుతోంది.
వాస్తవానికి, ఇది జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి చిన్న విషయాన్ని టార్గెట్ చేసి ప్రజలను దోచుకునే స్కామర్లు ఇంత పెద్ద దాయాది పోరును ఎందుకు వదిలేస్తారని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ విషయంపై పూర్తి స్థాయి నిజానిజాలు బయటకు రావాల్సి వుంది.
Also Read: Amazon Sale ముగిసిన తర్వాత కూడా జబర్దస్త్ Dolby Soundbar ఆఫర్ అందించింది.!
ఏది ఏమైనా ప్రజలు వాట్సాప్ లో అందుకునే లింక్స్ పై అప్రమత్తంగా ఉండాలి. నమ్మకమైన సోర్స్ నుంచి అందుకునే మెసేజ్ లను మాత్రమే నమ్మండి. ముఖ్యంగా లింక్స్ కలిగిన వీడియోలు లేదా మెసేజ్ లను ఖాతరు చేయకుండా పక్కన పెట్టేయడం మంచిది.
అలాగే, ఒకవేళ మీరు భారత్ – పాక్ పోరు వివరాలు లేదా న్యూస్ కోసం మరింత ఆసక్తి కనబరిస్తే మాత్రం నమ్మకమైన న్యూస్ ఛానల్స్ మరియు ప్రభుత్వం రిలీజ్ ప్రెస్ రిలీజ్ లను మాత్రమే ఫాలో అవ్వడం మంచిది. ప్రస్తుత సమయంలో స్కామర్లు కొత్త కొత్త స్కామ్స్ చేసే అవకాశం ఉంటుందని కోడోత్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు వాట్సాప్ లో సర్కులేట్ అయ్యే ప్రతి విషయాన్ని నమ్మవద్దని కూడా చెబుతున్నారు.