శామ్సంగ్ 200MP సెన్సార్ ISOCELL HP3 ఫీచర్లు ఇవే.!

Updated on 29-Jun-2022
HIGHLIGHTS

శామ్సంగ్ సరికొత్త 200MP సెన్సార్ ISOCELL HP3 ని ఆవిష్కరించింది

ఈ సెన్సార్ తి చిన్న పిక్సెల్‌తో వస్తుంది

ఈ కెమరాతో 30fps లో 8K వీడియో లేదా 120fps లో 4K వీడియోలను షూట్ చేయవచ్చు

శామ్సంగ్ సరికొత్త 200MP సెన్సార్ ISOCELL HP3 ని ఆవిష్కరించింది. ఈ సెన్సార్ కేవలం 0.56-మైక్రోమీటర్ పరిమాణంలో విస్తరించి ఉన్న అతి చిన్న పిక్సెల్‌తో వస్తుంది. కానీ, కెమెరా మాత్రం అద్భుతమైన ఫోటోలను మరియు 8K వీడియోలను చిత్రీకరించగలదని కంపెనీ చెబుతోంది. ఈ సెన్సార్ అనేక ఫీచర్లతో జతగా వస్తుంది. వీటిలో, సూపర్ QPD ఆటో ఫోకస్, స్మార్ట్ ISO ప్రో మరియు Tetrapixel పిక్సెల్ బిన్నింగ్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ 200 MP కెమెరా ఎటువంటి ఫీచర్లను కలిగివుందో తెలుసుకుందాం.    

Samsung ISOCELL HP3:

ఈ సెన్సార్ 0.56μm యొక్క 12% చిన్న పిక్సెల్ పరిమాణం 20% చిన్న కెమెరా మాడ్యూల్‌కు దారితీస్తుంది. దీని అర్ధం సమర్ధవంతమైన 200MP కెమెరా అయినా కూడా ఫోన్ ను సన్నగా నిర్మించేందుకు సహాయం చేస్తుంది.

ఇక ఈ శామ్సంగ్ 200MP కెమెరా సెన్సార్ యొక్క ప్రత్యేకతల విషయానికి వస్తే, ఇది సూపర్ QPD "మరింత ఖచ్చితమైన మరియు వేగవంతమైన ఆటో-ఫోకసింగ్" ని ఎనేబుల్ చేయడానికి సమాంతర మరియు నిలువు డైరెక్షన్ లలో తేడాలను ఉపయోగిస్తుంది. ఈ కెమరాతో మీరు 30fps లో 8K వీడియో లేదా 120fps లో 4K వీడియోలను షూట్ చేయవచ్చు.

Tetra Pixel టెక్నాలజీ 16 పిక్సెల్స్ ను ఒకదానిలో ఒకటిగా కలుపుతుంది. అంటే, ఇది 1.12μm-పిక్సెల్‌లతో 50MP సెన్సార్ లేదా 2.24μm-పిక్సెల్‌లతో 12.5MP సెన్సార్‌ని అనుమతిస్తుంది. ఇది "మసకబారిన వాతావరణంలో కూడా పవర్ ఫుల్ షాట్‌ లను" అందించగలదని కంపెనీ ప్రత్యేకించి చెబుతోంది. ఇక చివరిగా, Smart-ISO Pro మెరుగైన HDR స్నాప్స్ కోసం Low ISO, మిడ్ ISO మరియు హై ISO నుండి డేటాను మిళితం చేస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :