ఒక్క కాల్ అంటూ అడిగారని ఫోన్ ఇచ్చారో..మీ అకౌంట్ అవుతుంది ఖాళీ.!

HIGHLIGHTS

ఇప్పుడు మరొక కొత్త స్కామ్ పుట్టుకొచ్చింది

స్కామర్లు కొత్త Call Scam ను అదునుగా చేసుకున్నారు

ఇందుకు వాళ్ళు పెద్దగా శ్రమపడాల్సిన అవసరం కూడా లేదు

దేశంలో పూటకొక కొత్త స్కామ్ పుట్టుకు వస్తున్న సంగతి మనకు తెలిసిందే. అదేదారిలో ఇప్పుడు మరొక కొత్త స్కామ్ పుట్టుకొచ్చింది. అత్యవసరం చాలా అర్జెంటుగా కాల్ చేసుకోవాలి మీ ఫోన్ ఒక్కసారి ఇస్తారా? అని అడగడమే ఆలశ్యం మీ ఫోన్ ఇచ్చారనుకోండి, మీ అకౌంట్ ఖాళీ చేసేస్తారు. ఇందుకు వాళ్ళు పెద్దగా శ్రమపడాల్సిన అవసరం కూడా లేదు. జెస్ట్ ఒక నంబర్ కు డయల్ చేస్తే సరిపోతుంది. అందుకే, ఇటువంటి స్కామర్ల నుండి జర జాగ్రత్తగా ఉండండి. అలా ఉండాలంటే, ఈ కొత్త కాల్ స్కామ్ ఏమిటి, ఎలా పనిచేస్తుంది మరియు దాన్ని ఎలా కనిపెట్టాలో తెలుసుకోవాలి.

అసలు ఏమిటి ఈ Call Scam?

స్కామర్లు ప్రజల మంచితనాన్ని అదునుగా చేసుకొని ఈ కొత్త Call Scam ను అదునుగా చేసుకున్నారు. ఇందులో, స్కామర్లు అత్యవసరం చాలా అర్జెంటుగా కాల్ చేసుకోవాలి మీ ఫోన్ ఒక్కసారి ఇస్తారా? అని అడుగుతారు. మీరు ఫోన్ ఇచ్చినట్లయితే వారు వెంటనే *21* లేదా *401* కి కాల్ చేస్తారు. అంతే, ఇక్కడ నుండి మీ ఫోన్ కాల్స్ మరియు మెసేజీలు వారి నంబర్ కి ఫార్వార్డ్ అవుతాయి.           

Call Scam తో ఏమిటి ప్రమాధం?

పైన తెలిపి విధంగా మీ ఫోన్ మెసేజీలు మరియు కాల్స్ ఫార్వార్డ్ చేస్తే, మీ ఇంపార్టెంట్ మెసేజీలు (OTP లాంటివి) మరియు కాల్స్ మరిన్ని వివరాలు స్కామర్ల చేతిలోకి వెళ్లిపోతాయి. ఇంకేముంది మీ ఇన్ఫర్మేషన్ తో మీ జేబు ఖాళీ చేసేస్తారు.

మీ ఫోన్ లో ఇది ఎలా కనిపెట్టాలి?

మీకు తెలియకుండా మీ ఫోన్ లో ఎవరైనా కాల్ ఫార్వార్డింగ్ సెట్ చేశారో లేదో మీరు చాలా సులభంగా చెక్ చేయవచ్చు. దీనికోసం, మీ ఫోన్ నుండి *#62# లేదా *#67# నంబర్ కు డయల్ చేయగానే మీ ఫోన్ లో అన్ని వివరాలు చూడవచ్చు.

ఎలా నివారించాలి?

ఒకవేళ మీ ఫోన్ లో మీకు తెలియకుండా కాల్ ఫార్వార్డ్ సెట్ చేసినట్లయితే, మీరు  చాలా సులభంగా దాన్ని తొలగించవచ్చు. దీనికోసం, మీ ఫోన్ నుండి *73 కి డయల్ చేయండి లేదు మీ ఫోన్ Settings లో Call > Call Forwarding లోకి వెళ్లి కాల్ ఫార్వార్డింగ్ అప్షన్ నుTurn Off చేయవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :