సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ బ్లాక్స్ బాస్టర్ మూవీ 'సర్కారు వారి పాట' ఇప్పుడు OTT లో సందడి చేస్తోంది. ఇప్పటికి ఈ సినిమా థియేటర్లలో నిర్విజ్ఞంగా ఆడుతూ ఉండగానే OTT లో కూడా రిలీజ్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. అయితే, ఈ సినిమా KGF చాఫ్టర్ 2 మాదిరిగానే రెంట్ చెల్లించి చూసే విదంగా పే ఫర్ వ్యూ అప్షన్ తో వచ్చింది. అంతేకాదు, సర్కారు వారి పాట సినిమా కూడా 199 రూపాయల రెంట్ తో లభిస్తోంది. సినిమా థియేటర్ కు వెళ్లే అవసరం లేకుండానే ఈ రెంట్ చెల్లించి కుటుంభ సమేతంగా ఈ సినిమా ను ఎంజాయ్ చేయవచ్చు.
అమెజాన్ భారీ మొత్తాన్ని చెల్లించి సర్కారు వారి పాట సినిమా OTT రైట్స్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను జూన్ 24 న ప్రైమ్ వీడియో ద్వారా అందిస్తుందని ఊహిస్తుండగా, అంతకంటే చాలా ముందుగానే రెంటల్ అప్షన్ తో అమెజాన్ ప్రైమ్ వీడియో లోకి తీసుకొచ్చింది. విడుదలకు ముందునుండే భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలక్షన్స్ సాధించడమే కాకుండా బ్లాక్ బాస్టర్ మూవీగా కూడా నిలిచింది.
ఎప్పుడు సమాజానికి ఉపయోగపడే ఒక మంచి మెసేజ్ తో ముందుకొచ్చే మహేష్ బాబు ఈ సారి కూడా మంచి మెసేజ్ ఇచ్చారు. ప్రస్తుతం సమాజంలో వున్న మరియు సమాజాన్ని పట్టిపీడిస్తున్న గంభీరమైన విషయాన్ని గురించి చాలా సున్నితంగా చెప్పే ప్రయత్నం చేశారు. పరుశురామ్ దర్శత్వంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా మూవీ కంప్లీట్ ఎంటర్ టైనర్ గా కొనియాడబడింది.