OTT లో రిలీజ్ అయిన సర్కారు వారి పాట .. కానీ.. !!

Updated on 06-Jun-2022
HIGHLIGHTS

'సర్కారు వారి పాట' OTT లో రిలీజ్ అయ్యింది

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమా

అమెజాన్ భారీ మొత్తాన్ని చెల్లించి సర్కారు వారి పాట సినిమా OTT రైట్స్ ను సొంతం చేసుకుంది

బాక్సాఫీస్ వద్ద భారీ కలక్షన్స్ సాధించిన 'సర్కారు వారి పాట' OTT లో రిలీజ్ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క ఈ లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమా ప్రస్తుతం సినిమా థియేటర్లలో ప్రదర్శించ బడుతున్నా కూడా OTT లో కూడా రిలీజ్ చెయ్యబడింది. అయితే, సర్కారు వారి పాట సినిమా సబ్ స్క్రైబర్స్ అందరికి ఉచితం మాత్రం అనుకోకండి. ఈ సినిమా కూడా KGF చాఫ్టర్ 2 మాదిరిగానే రెంట్ చెల్లించి చూసే విదంగా పే ఫర్ వ్యూ అప్షన్ తో వచ్చింది. సర్కారు వారి పాట సినిమా కూడా 199 రూపాయల రెంట్ తో లభిస్తోంది. సినిమా థియేటర్ కు వెళ్లే అవసరం లేకుండానే ఈ రెంట్ చెల్లించి కుటుంభ సమేతంగా ఈ సినిమా ను ఎంజాయ్ చేయవచ్చు.

అమెజాన్ భారీ మొత్తాన్ని చెల్లించి సర్కారు వారి పాట సినిమా OTT రైట్స్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను జూన్ 24 న ప్రైమ్ వీడియో ద్వారా అందిస్తుందని ఊహిస్తుండగా, అంతకంటే చాలా ముందుగానే రెంటల్ అప్షన్ తో అమెజాన్ ప్రైమ్ వీడియో లోకి తీసుకొచ్చింది. విడుదలకు ముందునుండే భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలక్షన్స్ సాధించడమే కాకుండా బ్లాక్ బాస్టర్ మూవీగా కూడా నిలిచింది.

ఎప్పుడు సమాజానికి ఉపయోగపడే ఒక మంచి మెసేజ్ తో ముందుకొచ్చే మహేష్ బాబు ఈ సారి కూడా మంచి మెసేజ్ ఇచ్చారు. ప్రస్తుతం సమాజంలో వున్న మరియు సమాజాన్ని పట్టిపీడిస్తున్న గంభీరమైన విషయాన్ని గురించి చాలా సున్నితంగా చెప్పే ప్రయత్నం చేశారు. పరుశురామ్ దర్శత్వంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా మూవీ కంప్లీట్ ఎంటర్ టైనర్ గా కొనియాడబడింది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :