చాలా కాలంగా శామ్సంగ్ టీజ్ చేస్తున్న Samsung Galaxy M53 5G ని ఎట్టకేలకు విడుదల చేస్తోంది. శామ్సంగ్ M సిరీస్ నుండి ఈ సంవత్సరం వెంటవెంటనే స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తోంది. ఈ శామ్సంగ్ గెలాక్సీ M53 స్మార్ట్ ఫోన్ వేగవంతమైన 5G ప్రోసెసర్ మరియు 120Hz సూపర్ AMOLED డిస్ప్లే వంటి మరిన్ని స్పెక్స్ తో వస్తున్నట్లు శామ్సంగ్ పేర్కొంది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన స్పెసిఫికేషన్లను కూడా బయటపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ భారతదేశంలో ఏప్రిల్ 22న విడుదల కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ రివీల్ చేసిన ఫీచర్లను చూద్దామా.
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి ఆన్లైన్ లో రివీల్ చేసిన స్పెక్స్ విషయానికి వస్తే, గెలాక్సీ ఎం53 5జి స్మార్ట్ ఫోన్ లో ఇన్ఫినిటీ-0 కటౌట్ కలిగిన 6.7- ఇంచ్ Super AMOELD డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో ఎటువంటి ప్రాసెసర్ తో వస్తుందనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. కానీ, Dimensity 900 SoC కి జతగా 6GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుందని ఊహస్తున్నారు.
ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh భారీ బ్యాటరీని కలిగివుంటుంది. ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరాను ఇన్ఫినిటీ-0 కటౌట్ లో కలిగివుంటుంది. అలాగే, 108MP ప్రధాన సెన్సార్, 8MP అల్ట్రావైడ్, 2MP డెప్త్ సెన్సార్ మరియు 2MP మాక్రో సెన్సార్ కలిగిన క్వాడ్ రియర్ కెమెరా మాడ్యూల్‌ను వుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా One UI 4.1 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది.