నానాటికి మొబైల్ ఫోను యొక్క పరిమితులు మరింతగా విస్తరిండాన్ని చేస్తూనే ఉన్నాం. ఇప్పటికే అత్యంత వేగవంతమైన ప్రోసెస్సర్లతో ఒక మినీ కంప్యూటర్లలాగా మొబైల్ అవతరించగా, ఇక కెమేరాల విషయంలో కూడా హద్దులను చెరిపి వేసే దిశగా కొనసాగుతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే, భారీ 108 కెమేరాలతో వచ్చిన స్మార్ట్ ఫాంలను మనము చూశాము. ఈ భారీ 108 MP కెమేరాని అందించిన ఘనత శామ్సంగ్ సంస్థకు దక్కింది. ఇప్పుడు కూడా అతిభారీ 150MP కెమేరాని అందించనున్న మొదటి సంస్థగా కూడా శామ్సంగ్ సంస్థనే కానునట్లు అనిపిస్తోంది.
ఎందుకంటే, Samung ఒక 150MP కెమేరాని తయారీ చేసే పనిలో నిమగ్నమై ఉందని Gizchina ఒక నివేదికను అందించింది. ఈ నివేదిక ప్రకారం, శామ్సంగ్ సంస్థ ఒక స్మార్ట్ ఫోన్ లేదా స్మార్ట్ ప్రోడక్ట్స్ అందించేది మాత్రమే కాదు ఈ సంస్థ డిస్ప్లేలు, ప్రాసెసర్ మరియు మరిన్ని విడి భాగాలను కూడా అందించే సంస్థగా మనకు సుపరిచితమే. అటువంటి శామ్సంగ్, అందరికంటే ముందుగా ఒక 108 MP కెమేరాని ప్రకటించడమే కాకుండా ఇప్పుడు ఒక భారీ 150MP సెన్సార్ తీసుకొచ్చే పనిలో ఉందని తెలిపింది.
ముందుగా, 108 ISOCELL Bright HMX సెన్సార్ అందించిన శామ్సంగ్ సంస్థ ఈ సంవత్సరం 4 వ త్రైమాసానికల్లా ఈ 150MP కెమేరాతో ఒక స్మార్ట్ ఫోన్ను కూడా విడుదల చెయ్యవచ్చని కూడా ఈ నివేదిక చెబుతోంది. అంతేకాదు, ఇది 4-ఇన్-1 పిక్సెల్ నుండి అప్గ్రేడ్ వెర్షనుగా 9-ఇన్-1 బిన్నింగ్ తో 16MP సూపర్ ఫోటోలను తీసే విధంగా వుతుందని కూడా పేర్కొంది. ఇదే గనుక నిజమైతే, ఇక స్మార్ట్ ఫోన్ కెమేరాలు త్వరలోనే ప్రొఫెషనల్ కెమేరాల స్థాయిని చేరుకోవచ్చు.