RRR: ఎన్నడూ చూడని భారీ హిట్ దిశగా జక్కన సినిమా.. ఆ సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తోందట..!!

Updated on 25-Mar-2022
HIGHLIGHTS

జక్కన్న మరొకసారి తన పర్ఫెక్ట్ విజయాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు

ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన RRR మూవీ

ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ గురించి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు

విజయాన్ని తప్ప అపజయాన్ని చూడని జక్కన్న మరొకసారి తన పర్ఫెక్ట్ విజయాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. భారీ అంచనాలతో ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన RRR మూవీ భారీ హిట్ టాక్ తో మోత మోగిస్తోంది. ఒక్క మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గురించి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. RRR మూడు గంటల సేపు ఉన్నా కూడా ప్రేక్షకులను కట్టిపడేసిందని, సినిమా చూసి థియేటర్ నుండి బయటకి వచ్చిన  ప్రేక్షకులు కితాబు ఇచ్చారు.

సినిమాలో Jr.NTR మరియు రామ్ చరణ్ వంటి పెద్ద హీరోలను ఈ సినిమాలో ఎలా చూపిస్తారో! అనే సందేహాన్నిఆర్ఆర్ఆర్ విడుదలకు ముందు వ్యక్త పరిచిన వారికీ కూడా పరీక్షకులు సమాధాన మిచ్చారు. ఈ సినిమాలో Jr.NTR మరియు రామ్ చరణ్ ఇద్దరినీ సరి సమానంగా బ్యాలెన్స్ చేసి చూపించడం గురించి ప్రతిఒక్కరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక రాజమౌళి సినిమా అంటే ఆ సినిమాలో ఎటువంటు ఎలిమెంట్స్ ప్రేక్షకులు ఎక్స్ పెక్ట్ చేస్తారో, ఏది మిస్ కాకుండా ఈ సినిమాలో చూడవచ్చని కూడా సినిమా చూసిన ప్రేక్షకులు తమ రేటింగ్ మరియు రివ్యూలను అందిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ Jr.NTR మరియు రామ్ చరణ్ యొక్క ఎంట్రీ సిన్ లు సూపర్ గా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో 'నాటు నాటు' సాంగ్ మరియు ట్రైన్ సీన్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నట్లు సినిమా చూసిన ప్రతిఒక్కరు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.  

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :