రిలయన్స్ జియో ఈరోజు తన 5G స్మార్ట్ ఫోన్ ప్రకటిస్తోందా?

Updated on 24-Jun-2021
HIGHLIGHTS

రిలయన్స్ జియో ఈరోజు తన 5G స్మార్ట్ ఫోన్ ప్రకటిస్తోందా?

AGMs మీటింగ్ నుండి Jio 5G ఫోన్ ను ప్రకటించే అవకాశం

అతి చవక ధరలో 4G మరియు 5G ఫోన్లను అనౌన్స్ చేయవచ్చు

రిలయన్స్ జియో ఈరోజు తన 5G స్మార్ట్ ఫోన్ ప్రకటిస్తోందా? అనే ప్రశ్న ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే, రిలయన్స్ జియో ఈరోజు తన 44 వ AGMs మీటింగ్  ని షెడ్యూల్ చేసింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ మీటింగ్ లో కొత్త నిర్ణయాలను మరియు వ్యూహలను అమలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా, 5G టెక్నాలజీ ని బేస్ చేసుకుని చాలా ప్రకటనలను చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం అధికంగా వినిపిస్తున్న రూమర్లు కనుక నుయిజా నిజమైతే, ఈరోజు జరగనున్న మీటింగ్ నుండి Jio 5G ఫోన్ ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, రీసెంట్ గా గూగుల్ వెల్లడించినట్లుగా గూగుల్ జియో ఉమ్మడి సారధ్యంలో అతి చవక ధరలో 4G  మరియు 5G ఫోన్లను కూడా ఈ 44 AGMs మీటింగ్ నుండి అనౌన్స్ చేయవచ్చు.

ఇక ఈ 44వ AGMs మీటింగ్ విషయానికి వస్తే, ఈ మీటింగ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మీటింగ్ ను LIVE లో చూడాలనే ఆసక్తి వున్నవారు ఈ క్రింది సోర్స్ ల నుండి ఈ మీటింగ్ లైవ్ చూడవచ్చు.  

JioMeet, Youtube, Jio Channel, Facebook మరియు Twitter నుండి లైవ్ చూడవచ్చు. ఈరోజు జరగనున్న  44వ AGMs మీటింగ్ చాలా కీలకమైన నిర్ణయాలను తీసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ముందుగా, వచ్చిన రూమర్లు కనుక నిజమైనతే కొత్త ప్రోడక్ట్స్ తోపాటుగా కొత్త టెక్నాలజీ ని కూడా పరిచయం చేయవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :