కస్టమర్లకు షాకిచ్చిన జియో: రేపటి నుండి రీఛార్జ్ చేసే వారి జేబులకు చిల్లు

Updated on 30-Nov-2021
HIGHLIGHTS

రిలయన్స్ జియో కూడా కస్టమర్లకు షాకిచ్చింది

జియో తన ప్రీపెయిడ్ ప్లాన్స్ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది

ఈరోజు రీఛార్జ్ చేసుకుంటే పాత రేట్స్ ను పొందవచ్చు

రిలయన్స్ జియో కూడా కస్టమర్లకు షాకిచ్చింది. నిన్నటి వరకు ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా కంపెనీలు మాత్రమే రీఛార్జ్ రేట్లు పెంచిన టెలికం కంపెనీ లిస్ట్ లో ఉండగా, ఇప్పుడు రిలయన్స్ జియో కూడా ఈ లిస్ట్ లో వచ్చిచేరింది. జియో కూడా ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా (Vi ) దారిలోనే తన వినియోగదారులకు షాకింగ్ న్యూస్ ప్రకటించింది. జియో కూడా తన ప్రీపెయిడ్ ప్లాన్స్ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది.

లేటెస్ట్ గా జియో కూడా తన ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన టారిఫ్ రేట్లను పెంచింది. అయితే, ఈ కొత్త టారిఫ్ రేట్లు డిసెంబర్ 1 నుండి అమలులోకి వస్తాయి. అంటే, రేపటి నుండి రీఛార్జ్ చేసుకునేవారికి కొత్త రేట్లు వర్తిస్తాయి. కాబట్టి, ఈరోజు రీఛార్జ్ చేసుకుంటే పాత రేట్స్ ను పొందవచ్చు. ఒకేసారి లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్ కనుక రీఛార్జ్ చేస్తే          

డిసెంబర్ 1 నుండి జియో యొక్క పెరిగిన టారిఫ్ లు అమలులోకి వస్తే రీఛార్జ్ ల పైన అధికంగా చెలించవలసి వస్తుంది. రిలయన్స్ జియో (జియోఫోన్)  28 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ ప్రస్తుతం 75 రూపాయల ప్రారంభ ధరలో వస్తుండగా, డిసెంబర్ 1 నుండి 91 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది.

ఇక బడ్జెట్ వినియోగదారులకు ప్రీతిపాత్రమైన 24 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ 149 అన్లిమిటెడ్ ప్లాన్ రీఛార్జ్ కోసం 179 రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పొతే, 28 రోజుల ప్లాన్ రూ.199 ప్లాన్ కోసం రూ.239, రూ.555 రూపాయల క్వార్ట్రర్లి ప్లాన్ (84 రోజుల) కోసం రూ.666 చెల్లించాల్సి వస్తుంది. ఇక సంవత్సరం (365 రోజులు) వ్యాలిడిటీ ప్లాన్ కోసం అయితే ఏకంగా 480 రూపాయలు అధనంగా చెల్లించవలసి వస్తుంది.

ప్రస్తుతం రిలయన్స్ జియో One Year వ్యాలిడిటీ ప్లాన్ రూ.2,399 రూపాయలతో వస్తుండగా, డిసెంబర్ 1 నుండి ఈ ప్లాన్ కోసం  రూ.2,879 రూపాయల మొత్తాన్ని చెల్లించాలి. ఎల్లుండి నుండి జియో యొక్క ఈ కొత్త టారిఫ్ రేట్స్ అమలులోకి వస్తాయి. కొత్త టారిఫ్ రేట్స్ కోసం ఈ క్రింద చూడవచ్చు.

రిలయన్స్ జియో రీఛార్జ్ కోసం Click Here.        

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :