జియో ధమాకా అఫర్: నెల రోజుల వ్యాలిడిటీతో కొత్త అన్లిమిటెడ్ ప్లాన్ ప్రకటించిన జియో..!!

Updated on 02-Apr-2022
HIGHLIGHTS

జియో కొత్త నెల రోజుల వ్యాలిడిటీ అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ ను తీసుకువచ్చింది

ఈ ప్లాన్ ను రూ.259 రూపాయల ధరతో అందించింది

ఈ ప్లాన్ పూర్తి నెల రోజుల వ్యాలిడిటీతో వస్తుంది

రిలయన్స్ జియో కస్టమర్లకు ఇప్పటి వరకూ అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ అంటే కేవలం 28 రోజుల వ్యాలిడిటీతో మాత్రమే వస్తాయని తెలుసు. అయితే, ఈ బ్యారికేడ్స్ ను బ్రేక్ చేస్తూ, రిలయన్స్ జియో కొత్త నెల రోజుల వ్యాలిడిటీ అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ ను తీసుకువచ్చింది. తన పోర్ట్ ఫోలియోకు కొత్తగా జతచేసిన ఈ ప్లాన్ ను రూ.259 రూపాయల ధరతో అందించింది. ఇక అందించే లాభాలు కూడా బాగానే ఉంటాయి. ఈ ప్లాన్ పూర్తి నెల రోజుల వ్యాలిడిటీ, అంటే నెలలో ఎన్ని రోజులు ఉన్నాసరే (28,30, లేదా 31) అన్ని రోజులకు వర్తిస్తుంది. ఈ ప్లాన్ పూర్తి ప్రయోజాలను క్రింద చూడవచ్చు.

జియో రూ.259  ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ.259  ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి నెల రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 1.5 GB హై స్పీడ్ డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత  యాక్సెస్ ను తీసుకువస్తుంది.

ఇక సంవత్సరం మొత్తం అధిక లాభాలను అందించే బెస్ట్ ప్లాన్ కోసం చూనట్లయితే జియో యొక్క రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ ప్లాన్ అమౌంట్ ను 12 నెలలకు విడదీసి చూస్తే, నెలకు కేవలం రూ.250 రూపాయలు మాత్రమే అవుతుంది. అయితే, ఈ ప్లాన్ డైలీ 2.5GB హై స్పీడ్ డేటా మరియు మరిన్ని లాభాలను తీసుకు వస్తుంది. ఈ జియో బెస్ట్ వన్ ఇయర్ ప్లాన్ అందించే లాభాలను గురించి క్రింద చూడవచ్చు.

Jio Rs.2,999 Plan

ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 365 వ్యాలిడిటీతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 912.5GB ల హాయ్ స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత  యాక్సెస్ ను తీసుకువస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో రూ.499 రూపాయల విలువైన వన్ ఇయర్ డిస్నీ+ హాట్ స్టార్ మొబైల్ సభ్యత్వం కూడా ఉచితంగా లభిస్తుంది.

మరిన్ని జియో బెస్ట్ ప్లాన్స్ మరియు రీఛార్జ్ కోసం Click Here   

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :