రిలయన్స్ జియో తన వినియోగదారులకు కొత్త ఆఫర్ ని ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ రిపబ్లిక్ డే 2018 గా పిలుస్తారు మరియు ఇది జనవరి 26 నుండి మొదలవుతుంది. ఈ కొత్త ఆఫర్ ప్రకారం, జియో యొక్క ప్లాన్స్ లో రోజుకు 1GB డేటా వచ్చేది , ఇప్పుడు యూజర్స్ దీనిలో రోజుకు 1.5GB డేటాను పొందుతారు, మరియు రోజుకు 1.5GB డేటా పొందిన వారు ఇప్పుడు 2GB డేటాను రోజువారీ పొందుతారు . ఈ ఆఫర్ జనవరి 26 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ధరలు మరియు ప్రణాళికల వాలిడిటీ ఎటువంటి మార్పు లేదు. ఈ ఆఫర్లు ప్రైమ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.
అంటే, రూ .149, రూ .349, రూ 399, రూ .449 ప్లాన్స్ లో రోజుకు 1.5GB డేటాను పొందుతుండగా,వీటి వాలిడిటీ 28, 70, 84, 91 రోజులు.అలానే రూ. 198, రూ. 398, రూ .448, రూ. 498, ప్లాన్స్ లో 2 జిబి డేటా లభ్యం. వాలిడిటీ వరుసగా 28, 70, 84, 91 రోజులు పొందుతారు.