Jio: శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రకటించిన రిలయన్స్ జియో

Updated on 14-Feb-2022
HIGHLIGHTS

రిలయన్స్ జియో శాటిలైట్ ఇంటర్నెట్ బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టింది

100Gbps వరకు ఇంటర్నెట్ వేగాన్ని అందించగలదు

అంతరిక్షం నుండి నేరుగా ఇంటర్నెట్

రిలయన్స్ జియో శాటిలైట్ ఇంటర్నెట్ బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టింది. కొత్తగా ప్రకటించిన జియో స్పేస్ టెక్నాలజీ లిమిటెడ్(JSTL)  లక్సెంబర్గిష్ శాటిలైట్ మరియు నెట్‌వర్క్ ప్రొవైడర్ SES తో చాలా సంవత్సరాల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ డీల్ ద్వారా ఈ సర్వీస్ పూర్తిగా అమలులోకి వచ్చిన తరువాత భారతీయ వినియోగదారులకు 100Gbps వరకు ఇంటర్నెట్ వేగాన్ని అందించగలదు. ఈ డీల్  విలువ సుమారు 100 మిలియన్ డీలర్లు (దాదాపు 750 కోట్లు). ఇందులో, జియో 51% శాతం వాటాను, SES 49% శాతం వాటాను కలిగివుంటాయి.

జియో శాటిలైట్ ఇంటర్నెట్: ఎలా పనిచేస్తుంది

సింపుల్ గా చెప్పాలంటే మనం వాడుతున్న శాటిలైట్ టీవీ అదేనండి సెట్ టాప్ బాక్స్ లు మాదిరిగా పనిచేసే శాటిలైట్ ఇంటర్నెట్ ను ఊహించవచ్చు. అయితే, సెట్ టాప్ బాక్స్ యొక్క శాటిలైట్ రిసీవర్లు కేవలం సిగ్నల్స్ ను స్వీకరించడం మాత్రమే చేస్తాయి. కానీ, శాటిలైట్ ఇంటర్నెట్ లో మాత్రం రిసీవర్లు డేటాను పంపడం మరియు స్వీకరించడం రెండింటినీ నిర్వహించాల్సి వస్తుంది.

అంటే, ఈ శాటిలైట్ ఇంటర్నెట్ పని చేయడానికి, మీకు శాటిలైట్ డిష్, WiFi రౌటర్/మోడెమ్, కేబుల్స్ మరియు ఇతర సామాగ్రి అవసరం. ఇక పూర్తి సెటప్ చేసిన తరువాత, అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహం నుండి ఇంటర్నెట్ నేరుగా ప్రసారం చేయబడుతుంది. ఈ ప్రక్రియలో జియోస్టేషనరీ (GEO), మరియు మీడియం ఎర్త్ ఆర్బిట్ (MEO) ఉపగ్రహలతో పాటు మల్టీ-ఆర్బిట్ స్పేస్ నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తుందని జియో పేర్కొంది.

అయితే, ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ లను జియో ఎలా అందిస్తుందో ఖచ్చితంగా తెలుసుకోవాలంటే మాత్రం మరికొంత కాలం వేచిచూడాల్సిందే. అలాగే, ఈ శాటిలైట్ ఇంటర్నెట్ ధర మరియు లభ్యత వివరాలు కూడా ఇంకా బయటకు రాలేదు. కాబట్టి, ఖచ్చితమైన మనం ఇంకొంత కాలం వేచి ఉండవలసి ఉంటుంది.     

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :