అమెజాన్ ఇండియా జూన్ 1 నుండి 'రెడ్ మీ డేస్ సేల్' ను ప్రకటించింది ఈ సేల్ జూన్ 10 వతేది వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ నుండి రెడ్ మీ స్మార్ట్ ఫోన్ల పైన మంచి ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ నుండి Redmi Note 11T 5G స్మార్ట్ ఫోన్ 2000 రూపాయల వరకూ భారీ డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ 50MP AI క్వాడ్ రియర్ కెమెరా, 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లే మరియు ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ పైన అమెజాన్ అందించి ఆఫర్ మరియు స్పెక్స్ వివరాలను తెలుసుకుందామా.
రెడ్ మి నోట్ 11టి 5జి స్మార్ట్ ఫోన్ ను ICICI బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే కస్టమర్లకు 2,000 రూపాయల అదనపు తక్షణ డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. అలాగే, RBL క్రెడిట్ కార్డు EMI అప్షన్ తో కొనేవారికి 1,500 డిస్కౌంట్ అందుకోవచ్చు. ఈ బ్యాంక్ అఫర్ జూన్ 10 అర్ధరాత్రి వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతేకాదు, ఎక్స్ చేంజ్ అఫర్ ద్వారా ఈ ఫోన్ కొనేవారికి 10,000 రూపాయల వరకు భారీ తగ్గింపును కూడా అఫర్ చేస్తోంది. Buy From Here
రెడ్ మి నోట్ 11టి 5జి మూడు వేరియంట్స్ లో లభిస్తుంది. ఇందులో మొదటిది 6GB ర్యామ్ మరియు 64GB (1GB ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్) వేరియంట్ మరియు దీని ధర రూ.15,999. రెండవది 6GB ర్యామ్ మరియు 128GB (2GB ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్) వేరియంట్ మరియు దీని ధర రూ.16,999. ఇక చివరిది 8GB ర్యామ్ మరియు 128GB (3GB ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్) వేరియంట్ మరియు దీని ధర రూ.18,999.
రెడ్ మి నోట్ 11టి 5జి ఫోన్ యొక్క స్పెక్స్ విషయానికి వస్తే, 6.6 ఇంచ్ FHD+ డిస్ప్లేని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ కలిగి వుంది మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ గేమింగ్ ప్రోసెసర్ Dimensity 810 SoC తో పనిచేస్తుంది. దీనికి జతగా 6GB/8GB ర్యామ్ మరియు 64GB/128GB స్టోరేజ్ లను అందిస్తుంది.
కెమెరా పరంగా, ఈ ఫోన్ వెనుక 50MP AI క్వాడ్ రియర్ కెమెరాని కలిగివుంది. ఇందులో 50MP మైన్ కెమెరా, 8ఎంపి అల్ట్రా-వైడ్ కెమెరా, డెప్త్ మరియు పోర్ట్రైట్ సెన్సార్ లను అందించింది. ఇక సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది.
ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్ల విషయానికివస్తే, ఇది MIUI 12.5 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 OS తో నడుస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు,Hi-Res ఆడియో సర్టిఫికేషన్ తో కూడా వస్తుంది. సెక్యూరిటీ పరంగా, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్లాక్ ఫీచర్లను కలిగివుంది.