భారతీయ బడ్జెట్ వినియోదారులను లక్ష్యంగా చేసుకొని షియోమీ మరొక ఫోన్ మార్కెట్లో విడుదల చేసింది. అదే, Redmi 10 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను కేవలం 10-12 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసింది. కానీ, ఈ సెగ్మెంట్ లో ఇప్పటికే మార్కెట్లో ఉన్న స్మార్ట్ ఫోన్లకు గట్టి పోటీని ఇచ్చేలా ఈ రెడ్ మీ 10 ను తీసుకువచ్చిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ షియోమీ స్మార్ట్ ఫోన్ భారీ 6,000mAh బిగ్ బ్యాటరీ మరియు అతిపెద్ద 6.71 డిస్ప్లే వంటి చాలా ఫీచర్లను కలిగి వుంది. లేటెస్ట్ గా మార్కెట్లో అడుగు పెట్టిన ఈ రెడ్ మీ బడ్జెట్ బెస్ట్ ను గురించి వివరంగా చూద్దామా.
ఇక రెడ్ మీ 10 ఫో ధర విషయానికి వస్తే, ఈ ఫోన్ యొక్క 4+64GB వేరియంట్ ధర రూ.10,999 మరియు రెండవ వేరియంట్ 6+128GB మోడల్ ధర రూ. 12,999. ఈ స్మార్ట్ ఫోన్ మార్చి 24 వతేది మధ్యాహ్నం 12PM నుండి Flipkart మరియు Mi Store లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను HDFC క్రెడిట్ కార్డు ద్వారా కొనేవారికి 1,000 తగ్గింపు ఆఫర్ల ను కూడా కంపెనీ అందించింది.
ముందుగా ఈ ఫోన్ కంప్లీట్ స్పెక్స్ షీట్ ను చూస్తే, రెడ్ మీ 10 పెద్ద 6.71 ఇంచ్ HD రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేతో వస్తుంది. ఇది Widevine L1 సపోర్ట్ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతో ఉంటుంది. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ 6nm స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో వస్తుంది మరియు జతగా 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ లను కలిగి ఉంటుంది. అంతేకాదు, మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్ విస్తరణతో పాటుగా 2GB వరకూ వర్చువల్ RAM ను కూడా పొందుతారు.
కెమెరాల పరంగా, ఈ ముసార్ట్ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 50 MP ప్రైమరీ కెమెరాకి జతగా 2MP డెప్త్ సెన్సార్ వుంది. సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ 18W ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 6000 mAh బిగ్ బ్యాటరీని కూడా కలిగి వుంది (కానీ బాక్స్‌లో 10W అడాప్టర్ మాత్రమే వస్తుంది). ఈ షియోమీ లేటెస్ట్ బడ్జెట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా MIUI 12 సాఫ్ట్ వేర్ పైన నడుస్తుంది.