నెలకు రూ.590 కడితే చాలు ఈ లేటెస్ట్ Realme 5G ఫోన్ మీసొంతం అవుతుంది

Updated on 23-Feb-2022
HIGHLIGHTS

లేటెస్ట్ 5G ఫోన్ ను తక్కువ EMI తో పొందే అవకాశాన్ని Flipkart అందించింది

ఈ అఫర్ ను Month End Mobile Fest సేల్ ద్వారా అందించింది

ప్రధాన బ్యాంక్స్ క్రెడిట్/డెబిట్ కార్డ్స్ పైన 1500 రూపాయల అదనపు డిస్కౌంట్

కొత్త స్మార్ట్ ఫోన్ కోణాల్ని చూస్తున్న వారికీ శుభవార్త. Realme యొక్క లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ ను 590 రూపాయల అతితక్కువ EMI తో పొందే అవకాశాన్ని Flipkart అందించింది. ఈ అఫర్ ను Month End Mobile Fest సేల్ ద్వారా అందించింది. కేవలం అతి తక్కువ EMI అఫర్ మాత్రమే కాదు, UPI పేమెంట్ ద్వారా ఈ ఫోన్ కొనేవారికి 1000 వరకు తగ్గింపు మరియు Yes బ్యాంక్ మరియు IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో కొనేవారికి కూడా 1000 రూపాయల తగ్గింపును అఫర్ చేస్తోంది. మరి ఈ బెస్ట్ 5G ఫోన్ అఫర్ గురించి చూద్దామా.

Month End Mobile Fest సేల్ నుండి రియల్మీ నార్జో 30 5G స్మార్ట్ ఫోన్ పైన ఈ భారీ ఆఫర్లను అందించింది. పైన తెలిపిన అన్ని ఆఫర్లతో పాటుగా అన్ని ప్రధాన బ్యాంక్స్ క్రెడిట్/డెబిట్ కార్డ్స్ పైన 1500 రూపాయల అదనపు డిస్కౌంట్ ను కూడా ఆఫర్ చేస్తోంది.                            

Realme Narzo 30 5G: Price

రియల్మి నార్జో 30 5G స్మార్ట్ ఫోన్ కేవలం 6GB ర్యామ్ మరియు 128 GB స్టోరేజ్ కలిగిన సింగల్ వేరియంట్ తో వస్తుంది. ఈ ఫోన్ ధరను ప్రస్తుతం రూ.16,999.

Realme Narzo 30 5G: స్పెక్స్

ఈ Narzo 30 5G స్మార్ట్ ఫోన్ పంచ్ హోల్ డిజైన్ కలిగిన 6.5 ఇంచ్ డిస్ప్లే ని FHD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Dimensity 700 5G ప్రొసెసర్ తో పనిచేస్తుంది. ఇది ఆక్టా కోర్ CPU మరియు ARM Mali-G57 GPU తో ఉంటుంది. దీనికి జతగా  గరిష్టంగా 6GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది.

కెమెరా విభాగానికి వస్తే, ఈ లేటెస్ట్ రియల్మి స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్పు తో వస్తుంది. ఈ ట్రిపుల్ కెమెరా సెటప్ లో 48MP ప్రధాన కెమెరా నైట్ స్కెప్ సపోర్ట్ తో వస్తుంది మరియు 2MP పోర్ట్రైట్ కెమెరా మరియు 2MP మ్యాక్రో లెన్స్ ని కలిగి వుంటుంది. ఈ కెమెరా UIS వీడియో స్టెబిలైజేషన్ సపోర్ట్ తో వస్తుంది మరియు కొత్త నైట్ స్కెప్ ఫిల్టర్లతో వస్తుంది. ముందుభాగంలో, 16MP Samsung S5K3P9SP04 సెల్ఫీ కెమెరాని ఇచ్చింది.

ఇక ఛార్జింగ్  టెక్నాలజీ మరియు బ్యాటరీ విషయానికి వస్తే, ఈ 5G స్మార్ట్ ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీని 18 W క్విక్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ట్ తో వస్తుంది. ఈఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారితంగా Realme UI 2.0 స్కిన్ పైన పనిచేస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :