రియల్ మీ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Realme C30. ఈ స్మార్ట్ ఫోన్ ను రెండు రోజుల క్రితమే రియల్ మీ పెద్ద 5,000mAh బ్యాటరీతో మార్కెట్లో ప్రవేశపెట్టింది. కేవలం 7,499 రూపాయల ప్రారంభ ధరతో ప్రకటించిన స్మార్ట్ ఫోన్ మంచి ప్రాసెసర్, జతగా 3GB ర్యామ్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది. త్వరలో మొదటిసారి అమ్మకాలకు సిద్ధం కానున్న ఈ రియల్ మీ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్లు మరియు స్పెక్స్ లను తెలుసుకుందాం.
ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్టార్టింగ్ వేరియంట్ 2GB ర్యామ్ మరియు 32 స్టోరేజ్ తో రూ.7,499 ధరతో ప్రకటించింది. అలాగే, 3GB ర్యామ్ మరియు 32 స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,299. ఈ ఫోన్ జూన్ 27 న మొదటిసారిగా అమ్మకాలకు అంధుబాటులో ఉంటుంది.
రియల్ మీ C30 స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ ఫుల్ స్క్రీన్ ని 120Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ Unisoc T612 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 2GB/3GB ర్యామ్ మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి ఉంటుంది. ప్రత్యేకమైన మెమోరీ కార్డ్ ద్వారా స్టోరేజ్ ను 1TB వరకూ పెంచుకోవచ్చు. ఈ ఫోన్ లేక్ బ్లూ మరియు బ్యాంబూ గ్రీన్ రెండు కలర్ అప్షన్లలో లభిస్తుంది.
కెమెరాల విషయానికి వస్తే, రియల్ మీ C30 స్మార్ట్ ఫోన్ వెనుక కేవలం 8MP సింగల్ కెమెరాతో వస్తుంది. అలాగే, సెల్ఫీల కోసం ముందుభాగంలో 5MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీని 10W సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగిఉంటుంది.