rbi proposed a hour delay on Online payment or digital payment more than Rs 10000 to curb fraud
ఫ్రాడ్ మరియు స్కామ్ లకు చెక్ పెట్టడానికి Online చెల్లింపు గంట జాప్యం కోసం RBI కొత్త ప్రతిపాదన పెట్టినట్లు సొషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా న్యూస్ వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ కొత్త వైరల్ న్యూస్ గురించి మీరు తెలుసుకోవాల్సిన కంప్లీట్ వివరాలు ఈ రోజు మీకోసం అందిస్తున్నాం. ద్వారా రోజుకు కొన్ని కోట్లలో ట్రాన్సాక్షన్ జరుగుతున్న కారణంగా ఈ పేమెంట్ సిస్టం ను మరింత కట్టుదిట్టంగా మరియు సురక్షితంగా మార్చడానికి ఆర్బిఐ పని చేస్తోంది. ఇందులో ఈ కొత్త ప్రతిపాదన చేసినట్లు మనం చూడవచ్చు.
ప్రజా ప్రయోజనార్థం ఇటీవల Reserve Bank of India (RBI) ఒక కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. అదేంటంటే, UPI / IMPS ద్వారా రూ. 10,000 రూపాయలు లేదా అంతకంటే పైబడి డిజిటల్ పేమెంట్స్ పై వెంటనే సెండ్ చేసే విధానం కాకుండా 1 గంట ఆలస్యంగా సెండ్ అయ్యే విధానం కోసం ప్రతిపాదన చేసింది.
అయితే, ఇది ఇప్పటికీ ప్రతిపాదన (ప్రపోసల్) మాత్రమే అని మీరు గమనించాలి. ఇంకా విషయాన్ని ఫైనల్ గైడ్ లైన్ గా ప్రకటించలేదు. ఈ కొత్త రూల్ లేదా అప్డేట్ కోసం బ్యాంక్స్ మరియు ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టినట్లు చెబుతున్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ప్రతిపాదన తీసుకురావడానికి చాలా పెద్ద కారణమే ఉంది. రోజుకి కోట్ల కొద్ది జరిగే డిజిటల్ లేదా ఆన్లైన్ పేమెంట్ సిస్టం ను మరింత పటిష్టంగా చేయడానికి ఈ ప్రతిపాదన తెచ్చింది. ముఖ్యంగా పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలను అరికట్టడానికి ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు తెలిపింది.
పేమెంట్ గంటసేపు ఆలస్యం చేయడం ద్వారా పేమెంట్ జరిగిన తర్వాత కూడా పేమెంట్ ని అడ్డుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ పేమెంట్ యూజర్ కి తెలియకుండా జరిగినట్లయితే ఈ పేమెంట్ ని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. అంటే, ఆన్లైన్ ఫ్రాడ్ మరియు స్కామ్ లకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. అందుకే, రూ. 10,000 రూపాయలు పైబడి చేసే పేమెంట్లు ఇన్స్టాంట్ గా కాకుండా గంట వ్యవధిలో పేమెంట్ అయ్యేలా కొత్త సిస్టం తేవాలని RBI చూస్తోంది.
Also Read: Google Pixel 10 ఫోన్ ఫ్లిప్ కార్ట్ సమ్మర్ సేల్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో లభిస్తోంది.!
ఇది కాకుండా యూజర్ కి తెలియకుండా జరిగే పేమెంట్ ను నిలిపివేయడానికి కిల్ స్విచ్ (Kill Switch) ఆప్షన్ ఇవ్వాలని కూడా యోచిస్తోంది. ఇది అవాంఛిత మరియు ఫ్రాడ్స్టర్స్ పేమెంట్స్ ని క్యాన్సిల్ చేస్తుంది.
అయితే, ఈ కొత్త రకం పేమెంట్ సిస్టం పై వ్యాపారస్తులకు మినహాయింపు ఉండే అవకాశం ఉంటుంది.