ఇక డబ్బు డ్రా చెయ్యాలంటే డెబిట్ కార్డ్ లతో పనిలేదు. ఎందుకంటే, డెబిట్ కార్డ్ లతో పనిలేకుండా ATM ల నుండి అమౌంట్ ను విత్ డ్రా చేసేందుకు వినియోగదారులకు అనుమతించేలా ప్రతీ బ్యాంక్ కూడా సహకరించాలని RBI ప్రతిపాదించింది. దీనికోసం అన్ని బ్యాంకులు కూడా ATM లలో కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణ (Card less Cash Withdraw) సౌకర్యాన్ని అందిచాలని RBI పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో ATM నుండి డబ్బు తీసుకోవడానికి కొత్త నిబంధనలు జారీ చేయబడ్డాయి.
ఇది డిజిటల్ ఇండియా దిశగా కొత్త విధానాలకు ప్రారంభం అవుతుంది. ATM లేకుండానే మీ సంబంధిత ATM కౌంటర్ల నుండి డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు ఈ కార్డ్‌లెస్ క్యాష్ విత్ డ్రా ప్రకటన చేయబడింది.
ప్రస్తుతం జరుగుతున్న ఆన్లైన్ మోసాల్లో ఎక్కువ జరుగుతున్న కార్డ్ స్కిమ్మింగ్, కార్డ్ క్లోనింగ్ మొదలైన మోసాలను నిరోధించడంలో ఈ కార్డ్‌లెస్ క్యాష్ విత్ డ్రా సహాయపడుతుంది. అంతేకాదు, అన్ని లావాదేవీలకు ఫిజికల్ కార్డ్ అవసరం ఉండదు మరియు కార్డ్ స్కిమ్మింగ్, కార్డ్ క్లోనింగ్ మొదలైన మోసాలను నిరోధించడంలో ఇది సహాయపడుతుంది.
ఇది పనిచేసే విధానం దీని పేరులోనే వుంది. కార్డ్‌లెస్ క్యాష్ విత్ డ్రా అనేది ఎటువంటి ఫిజికల్ కార్డు అవసరం లేకుండా ATM నుండి నగదు విత్ డ్రా చేసేందుకు ఉపయోగపడే సర్వీస్. వాస్తవానికి, ఈ సిస్టం ఇప్పటికే చాలా బ్యాంకుల్లో అమలవుతోంది మరియు అందుబాటులో కూడా వుంది.