Ray-Ban AI Glasses with meta ai launched in India
Ray-Ban AI Glasses: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కలిగిన స్టైలిష్ కళ్ళజోడు ను ప్రముఖ కళ్లజోడు తయారీ కంపెనీ రేబాన్, ఇండియాలో విడుదల చేసింది. ఇది మామూలు కళ్ళజోడు అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే, ఇది Meta AI సపోర్ట్ తో వచ్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లాసెస్ మరియు ఇది పవర్ ఫుల్ కెమెరా, స్పీకర్లు, మైక్ మరియు వాయిస్ కమాండ్ వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది.
రేబాన్ AI ఫీచర్ తో రెండు కొత్త గ్లాసెస్ అందించింది. ఈ రెండు కళ్ళజోడు లను కూడా ఒకే ధరలో అందించింది. ఈ కళ్లజోడు లను రూ. 29,990 రూపాయల ధరతో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ గ్లాసెస్ ను సేల్ కి కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది.
రేబాన్ ఈ కొత్త గ్లాసెస్ లను నైలాన్ మరియు ప్రొపియోనేట్ మిక్స్ మెటీరియల్ తో అందించింది. ఇందులో పాలికార్బోనేట్ మెటీరియల్ గ్లాస్ లను అందించింది మరియు ఇది క్యాట్ ఐ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఇక ఇందులో అందించిన ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ గ్లాసెస్ రెండు ఓపెన్ ఇయర్ స్పీకర్లు కలిగి ఉంటాయి. ఇవి చెవికి దగ్గరగా ఉండి చక్కగా వినిపించేలా సెట్ చేయబడ్డాయి.
అలాగే, ఈ రేబాన్ కళ్ళజోడు 5 మైక్ లను కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఈ రేబాన్ కళ్ళజోడు లో 12 MP కెమెరాలను అందించింది. ఇది FHD వీడియో రికార్డ్ సపోర్ట్ మరియు క్లియర్ ఇమేజ్ షూట్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ రేబాన్ గ్లాసెస్ ను 32GB ఫ్లాష్ స్టోరేజ్ తో అందించింది. ఇది 500+ ఫోటోలు లేదా 100+30s వీడియో స్టోరేజ్ కు ఉపయోగపడుతుంది.
ఈ రేబాన్ AI గ్లాసెస్ టచ్, వాయిస్ మరియు Meta అసిస్టెంట్ ఫీచర్స్ తో వస్తుంది. ఇది మీ ఫోన్ ను పూర్తి వాయిస్ సపోర్ట్ తో హ్యాండిల్ చేస్తుంది. కాల్, మెసేజ్, కంటెంట్ క్యాప్చర్ మరియు మీడియా సెట్టింగ్స్ మేనేజ్ చేయడానికి మీ ఫోన్ ను జేబులోంచి తీయవలసిన పని లేకుండానే చేస్తుంది. ఇది WiFi 6 సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు IPX4 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.
Also Read: iQOO Neo 10 సూపర్ బ్రైట్ స్క్రీన్ మరియు Sony కెమెరాతో లాంచ్ అవుతోంది.!
ఈ కళ్లజోడు Meta AI సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు Hey Meta అని పిలవగానే మీ కామండ్స్ ఫాలో అవ్వడం మొదలు పెడుతుంది. ఈ రేబాన్ కళ్ళజోడు మంచి లైఫ్ కలిగిన బ్యాటరీతో వస్తుంది మరియు కళ్లజోడు పెట్టుకునే కేసు ఛార్జ్ చేసే సాధనంగా ఉంటుంది. ఈ రేబాన్ కళ్ళజోడు తో మీరు చూసే ప్రతి విషయం గురించి చర్చించవచ్చు. అంటే, ప్లేస్ వివరాలు, హిస్టరీ లేదా మరింకేదైనా వివరాలు ఇన్స్టాంట్ గా అందిస్తుంది. అంతేకాదు, లాంగ్వేజ్ తర్జుమా చేసే ఫీచర్ కూడా ఇది కలిగి ఉంటుంది.